ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి.. తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారుల షాక్‌!

సోదాల్లో ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో నుంచి ఏడు ఆకుపచ్చ పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసిన వైట్ కలర్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పద వ్యక్తి.. తనిఖీ చేసిన కస్టమ్స్‌ అధికారుల షాక్‌!
Heroin Drugs Seized
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 13, 2024 | 10:37 AM

న్యూఢిల్లీలోని ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో డ్రగ్స్‌ కలకలం సృష్టించింది. బ్యాంకాక్ నుంచి కౌలాలంపూర్ మీదుగా న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 3కి చేరుకున్న భారతీయ ప్రయాణికుడిని నుంచి భారీగా హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. ప్రయాణికుడి అనుమానాస్పద కార్యకలాపాలను చూసిన, విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారుల బృందం అతన్ని ఆపాలని నిర్ణయించుకుంది. సోదాలో, హెరాయిన్ పట్టుబడింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని ఢిల్లీ కస్టమ్స్ (ఎయిర్‌పోర్ట్ అండ్ జనరల్) అధికారులు తెలిపారు. అతనిపై డ్రగ్స్ హెరాయిన్ స్మగ్లింగ్ కేసు నమోదైంది.

సుమారు రూ.29.28 కోట్ల విలువైన 7.321 కిలోల అనుమానిత వైట్ హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రీన్‌ ఛానల్‌ దాటి ఇంటర్నేషనల్‌ అరైవల్‌ హాల్‌ ఎగ్జిట్‌ గేట్‌ వైపు వెళుతుండగా ఆగిపోయారని అధికారులు తెలిపారు. సోదాల్లో ప్రయాణికుడి ట్రాలీ బ్యాగ్‌లో నుంచి ఏడు ఆకుపచ్చ పాలిథిన్ ప్యాకెట్లలో ప్యాక్ చేసిన వైట్ కలర్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుడు NDPS చట్టం, 1985లోని వివిధ నిబంధనలను ఉల్లంఘించాడు. ప్రయాణికుడిని ఎన్‌డిపిఎస్ చట్టం, 1985 సెక్షన్ 43 (బి) కింద అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అక్రమ మాదక ద్రవ్యాల వ్యాపారంపై నిఘా ఉంచే క్రమంలో భాగంగానే ఈ స్మగ్లింగ్ కేసును గుర్తించినట్లు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు తెలిపారు.

దేశంలో పెరుగుతున్న మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కేసులపై ఈ ఉదంతం తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా విమానాశ్రయాల్లో కస్టమ్స్ అధికారుల అప్రమత్తత ఇలాంటి నేరాలను అరికట్టేందుకు కీలకంగా మారుతోంది. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఇంతకుముందు ఇలాంటి కేసుల్లో అరెస్టులు జరిగాయి. అయితే ఈసారి భారీ మొత్తంలో హెరాయిన్ పట్టుబడటం మరింత తీవ్రం చేసింది. ఇప్పుడు ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌లోని ఇతర సభ్యులను పట్టుకునేందుకు కస్టమ్స్ డిపార్ట్‌మెంట్ ఈ విషయంపై దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్‌ రవాణాను అరికట్టేందుకు భవిష్యత్తులో మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అమ్మ బాబోయ్‌.. ఇంత డ్రగ్స్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వచ్చింది?
అమ్మ బాబోయ్‌.. ఇంత డ్రగ్స్‌ ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వచ్చింది?
మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?
మీ పాన్‌కార్డు రద్దు కానుంది..? కారణం ఏంటో తెలుసా..?
మరింత కష్టాల్లో ఎంటీఎన్‌ఎల్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం కానుందా?
మరింత కష్టాల్లో ఎంటీఎన్‌ఎల్‌.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో విలీనం కానుందా?
మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ప్లాన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటి?
మెటర్నిటీ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? ఈ ప్లాన్‌ వల్ల ప్రయోజనాలు ఏంటి?
ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ ఏమైందంటే
ఇదెక్కడి విడ్డూరం.. టూత్ బ్రష్‌ను అమాంతంగా మింగేసిన మహిళ ఏమైందంటే
రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!
రాజ్, కావ్యలను కలిపేందుకు పెద్దాయన పందెం.. ఇరుక్కున్న కళావతి!
4వ తరగతి విద్యార్థిని వదలని ఉపాధ్యాయుడు!
4వ తరగతి విద్యార్థిని వదలని ఉపాధ్యాయుడు!
కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ అరెస్ట్
కలెక్టర్‌పై దాడి ఘటన.. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌ అరెస్ట్
మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో.. ఆ సొగసు చూడతరా..! ఇదిగో వీడియో
మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో.. ఆ సొగసు చూడతరా..! ఇదిగో వీడియో
ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..
ఉత్తరాంధ్ర యాసలో అదరగొట్టిన మెగాస్టార్..