దుమారం రేపిన మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. నిందితుడి ఇల్లు కూల్చివేసిన అధికారులు
మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సభ్యసమాజం తలదించుకనే రీతిలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ దారుణమైన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడైనటువంటి భరత్ సోని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే ఈ ఘటనను అధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఉజ్జయినిలోని అతడి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతేకాదు అతడి ఇల్లు ఇది అక్రమ కట్టడమని చెబుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో సభ్యసమాజం తలదించుకనే రీతిలో ఓ బాలికపై అత్యాచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ దారుణమైన అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసులో ప్రధాన నిందుతుడైనటువంటి భరత్ సోని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే ఈ ఘటనను అధికారులు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఉజ్జయినిలోని అతడి ఇంటిని కూల్చివేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అంతేకాదు అతడి ఇల్లు ఇది అక్రమ కట్టడమని చెబుతున్నారు. అలాగే భరత్ సోని కుటుంబ సభ్యులు కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో నివాసముంటున్నారని గుర్తించినట్లు ఉజ్జయిని మున్సిపల్ కమిషనర్ రోషన్ సింగ్ వెల్లడించారు. అందుకోసమే వాళ్ల ఇంటిని కూల్చివేయాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. వారు నివాసముంటున్నటువంటి భూమి ప్రభుత్వానికి చెందినదని.. అందువల్ల ఇంటిని కూల్చివేసేందుకు వాళ్లకు ఎలాంటి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీసులతో కలిసి బుధవారం నాడు అక్రమంగా నిర్మించినటువంటి ఆ ఇంటిని కూల్చివేయనున్నామని ఆ మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. అత్యాచారానికి గురైనటువంటి ఆ బాలిక రక్తంతో.. అర్థనగ్నంగా వీధులో సాయం కోసం తిరిగిన దృశ్యాలు సెప్టెంబర్ 26న వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి. ఈ బాలికి జరిగిన దారుణం పట్ల నెటీజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అంతేకాదు అలాంటి స్థితిలో ఉన్న ఆ బాలికను స్థానికులు పట్టించుకోనందుకు కూడా తీవ్రంగా విమర్శలు చేశారు. దాదాపు రెండు రెండు గంటల పాటుగా ఆమె వందల ఇళ్లు, డాబాలు, అలాగే టోల్ బుత్‌ల మీదుగా వెళ్లిన కూడా ఎవరూ సాయం చేసేందుకు ముందుకు రాలేదు. దీంతో చివరికి ఓ ఆలయ పూజారి ముందుకొచ్చి పోలీసులకు సమాచారం అందజేశాడు.
అయితే ఆ బాలిక అలా వీధుల్లో తిరిగిన దృశ్యాలు పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు రంగంలోకి దిగారు. వెంటనే ఈ ఘటనపై విచారణ చేపట్టారు. అలాగే వందలమందిని విచారించారు. అలాగే దాదాపు 700 కెమెరాల్లో రికార్డైన దృశ్యాలను కూడా విశ్లేషించారు. ఆ తర్వాత ఆ తర్వాత ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నటువంటి భారత్ సోనీని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. అతడ్ని విచారణ చేస్తూ ఆధారాల సేకరణ కోసం ఘటనాస్థలానికి తీసుకెళ్లారు. అయితే అతడు అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంటనే స్పందించి అతడ్ని నిర్బంధించారు. అంతేకాదు అతడికి మరణ శిక్ష వేయాలంటూ కూడా డిమాండ్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్నాయి. ఇలాంటి తరుణంలో ఈ ఘటన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అలాగే ఈ ఘటన ఇప్పుడు రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపుతోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..








