corona.. hot india ఇండియాలో వ్యాపించని కరోనా.. ఎందుకు ?

చైనాలో మొదలై..సుమారు 30 దేశాలను కబళించిన కరోనా వైరస్ (కోవిడ్-19) ఇండియాలో మాత్రం వ్యాపించలేదు.. ఎందుకు ? కేరళలో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. తాజాగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ దేశాలకు కూడా వ్యాపించిన ఈ వైరస్.. ఈ దేశంలో 'కాలు పెట్టలేదు'.

corona.. hot india ఇండియాలో వ్యాపించని కరోనా.. ఎందుకు ?
Follow us

|

Updated on: Feb 25, 2020 | 6:35 PM

చైనాలో మొదలై..సుమారు 30 దేశాలను కబళించిన కరోనా వైరస్ (కోవిడ్-19) ఇండియాలో మాత్రం వ్యాపించలేదు.. ఎందుకు ? కేరళలో మూడు కేసులు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. తాజాగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్ దేశాలకు కూడా వ్యాపించిన ఈ వైరస్.. ఈ దేశంలో ‘కాలు పెట్టలేదు’. జాతీయంగా, అంతర్జాతీయంగా కూడా వైద్య వర్గాలు దీనిపై తర్జన భర్జన పడుతున్నాయి. చైనాకు, ఇండియాకు మధ్య  భౌగోళికంగా కొన్ని  సారూప్యతలున్నా.. అలాగే రెండు దేశాల మధ్యా వాణిజ్య సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ.. ఇండియాకు ఈ వైరస్ వ్యాపించని  కారణాన్ని నిపుణులు,  విశ్లేషకులు…ఈ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే కారణమని తేల్చారు. శీతల, తేమ వాతావరణంలో ఈ వైరస్ త్వరగా వ్యాపిస్తుందని, కానీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు దీన్ని నశింప జేస్తాయని వారు కనుగొన్నారు. కేరళలో మూడుకేసులు బయటపడినప్పటికీ.. వ్యాధిగ్రస్తుల నిరోధక శక్తి కారణంగానో, ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యల కారణంగానో కరోనా బాధితులు దాని బారి నుంచి శీఘ్రంగా కోలుకున్నట్టు వెల్లడైంది. అలాగే చైనా నుంచి ఇండియాకు తిరిగి వఛ్చిన వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డుల్లో ఉంచి చికిత్స అందించి నందువల్ల కూడా మంచి ఫలితాలు వచ్చాయని అంటున్నారు.