Gujarat Hooch Tragedy: కాటేస్తున్న కల్తీ మద్యం.. ఇప్పటివరకు 20 మంది మృతి.. 40 మంది పరిస్థితి విషమం..

|

Jul 26, 2022 | 11:08 AM

గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా, అహ్మదాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు.

Gujarat Hooch Tragedy: కాటేస్తున్న కల్తీ మద్యం.. ఇప్పటివరకు 20 మంది మృతి.. 40 మంది పరిస్థితి విషమం..
Hooch Tragedy
Follow us on

Gujarat Hooch Tragedy: గుజరాత్‌లో కల్తీ మద్యం పడగవిప్పింది. కల్తీ మద్యం తాగి ఏకంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 40 మంది ఆసుపత్రుల పాలయ్యారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గుజరాత్‌లోని బొటాడ్ జిల్లా, అహ్మదాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి ఇప్పటివరకు 20 మంది చనిపోయినట్లు అధికారులు ప్రకటించారు. గుజరాత్​లోని భావ్​నగర్​పరిసరాల్లోని ఆసుపత్రుల్లో 47 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆస్పత్రుల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన గుజరాత్ ప్రభుత్వం విచారణకు సిట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ ఘటన అనంతరం ఆయా గ్రామాలకు వైద్య బృందాలను తరలించి పర్యవేక్షిస్తున్నారు. పలు షాంపిళ్లను సైతం సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఇంకా ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు కెమికల్ ఫ్యాక్టరీ యజమాని సహా 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. అందరినీ ప్రశ్నిస్తున్నారు. గుజరాత్‌లో చాలా ఏళ్లుగా మద్యపాన నిషేధం అమలులో ఉన్నా.. మద్యం ఎక్కడి నుంచి వచ్చింది.. ఎలా తయారు చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ ఘటన తర్వాత గుజరాత్‌లో మద్యపాన నిషేధంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో విషపూరిత మద్యం దుర్ఘటనను దురదృష్టకరమని అభివర్ణించారు. మద్యపాన నిషేధం ఉన్న రాష్ట్రంలో.. కల్తీ మద్యం అమ్ముతున్న వారికి రాజకీయ అండ ఉందంటూ ఆరోపించారు. కల్తీ మద్యం విక్రయించిన సొమ్ము ఎక్కడికి పోతుందో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..