
మరో ఎయిరిండియా విమానంలో మంటలు వ్యాపించాయి. ఈ ఘటన విమాన ప్రయాణికుల్ని మరింత భయాందోళనకు గురిచేస్తుంది. విమానం ల్యాండైన కాసేపటికే పవర్ యూనిట్‌లో మంటలు చెలరేగాయని తెలియటంతో అప్రమత్తమైన ఎయిరిండియా సిబ్బంది ప్రయాణికుల్ని సురక్షితంగా కిందకు దింపేశారు. అయితే ఈ విమానం హంకాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI-315గా తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
ఢిల్లీ విమానాశ్రయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. హాంగ్‌కాంగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా AI 315 విమానంలో మంటలు చెలరేగాయి. విమానం ల్యాండింగ్ అయిన కొద్ది సేపటికే విమానం ఆక్సిలరీ పవర్ యూనిటలో మంటలు చెలరేగాయి. కానీ, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించటంతో ప్రయాణికులతో పాటుగా సిబ్బంది సైతం సురక్షితంగా బయటపడినట్లు ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి స్పష్టం చేశారు.
ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. జూలై 22న మంగళవారం హాంగ్‌కాంగ్ నుంచి ఢిల్లీకి వచ్చిన AI 315 విమానం, ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ అయి గేట్ వద్ద పార్క్ చేసిన కొద్ది క్షణాల్లో APUలో మంటలు చెలరేగాయని పేర్కొంది. మంటలు చెలరేగిన తర్వాత ఏపీయూను ఆటోమేటిక్‌గా స్విచ్ఛాఫ్ చేశామని ప్రతినిధి చెప్పారు. ప్రమాదం కారణంగా విమానం స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..