ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కాల్సిందే. మనుషుల బలహీనతలను, ఆశనే పెట్టుబడిగా పెట్టి హనీట్రాప్ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ రకమైన మోసాలు ప్రస్తుతం ఎక్కువయ్యాయి. అప్రమత్తంగా లేకుంటే డబ్బులు పోవడంతో పాటు, పరువు, ప్రతిష్టలకు భంగం కలగక తప్పదు. ముఖ్యంగా విద్యార్థులు, యువకులు, ఉద్యోగులే లక్ష్యంగా మహిళల పేరుతో ఈ నేరాలకు దిగుతున్నారు. మొదట న్యూడ్ వీడియోలు పంపించి.. ఆ తర్వాత మార్ఫింగ్‌లు చేస్తారు. డబ్బులు ఇవ్వాలని, లేదంటే ఈ వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరిస్తారు. చివరకు బయటకు చెప్పుకోలేక ట్రాప్‌లో పడేవారు కొందరైతే.. ఆత్మహత్యలకు పాల్పడేవారు మరికొందరు. సైబర్ నేరాలను చూసి చాలా మంది ఇన్‌స్పైర్ అవుతున్నారు. చాలా ఈజీగా హనీట్రాప్ చేసేస్తున్నారు. డబ్బులు కొల్లగొడుతున్నారు. ఇచ్చిన డబ్బులను ఎగ్గొడుతున్నారు. కొందరు పోలీసులకు దొరికితే మరికొందరు చుప్‌చాప్‌గా పనికానిచ్చేస్తున్నారు.
తాజాగా కర్ణాటకలోని దావణెగెరెలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. జ్యూస్‌లో మత్తు మందు కలిపి ఇచ్చి..హనీట్రాప్ చేసింది. ఇరుక్కుపోయింది. ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుడిని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దావణగెరె పట్టణం సరస్వతీ నగరకు చెందిన యశోదను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. దావణెగెరెలోని శివకుమారస్వామి లేఔట్‌కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగరకు చెందిన యశోదతో పరిచయం ఏర్పడింది. అది స్నేహంగా మారింది.. అప్పుడప్పుడూ చిదానందప్ప యశోద ఇంటికొచ్చేవాడు. అలా వచ్చినప్పుడు కాసేపు ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు.. ఇదే అదనుగా తరచూ చిదానందప్పను కాఫీకి ఇంటికి పిలిచేది యశోద.. ఈ క్రమంలో.. అతడితో 86 వేల రూపాయలు అప్పుగా తీసుకుంది. అతడు కూడా మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు.
కొద్దిరోజుల తర్వాత డబ్బు వాపసు ఇవ్వాలని అడగడంతో.. ఒక రోజు వాకింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న చిదానందప్పను యశోద ఇంటికి పిలిచి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృ హ తప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల తరువాత లేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు. ఆందోళన చెందిన చిదానందప్ప బట్టలు వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు.
రెండ్రోజుల తర్వాత చిదానందప్పకు యశోద ఫోన్ చేసింది. డబ్బులు డిమాండ్ చేసింది. అదేంటి నువ్వే నాకు ఇవ్వాలి కదా..అంటే.. తన వద్ద నీ న్యూడ్ వీడియో ఉందని.. 15 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది.. లేదంటే ఆ వీడియోను.. నీ కుటుంబ సభ్యులకు పంపిస్తానని.. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించింది. ఇదేం తలనొప్పిరా అనుకున్న చిదానందప్ప తన స్నేహితుల వద్ద గోడు వెళ్లబోసుకున్నాడు. ఈలోగా.. చిదానంద వాట్సప్‌కు అతడి న్యూడ్ ఫోటోను యశోద పంపింది. చిదానందప్పకు ఫీజులౌట్. మేటర్ చిదానంద కొడుక్కు తెలిసింది. దీంతో.. అతడు నేరుగా పోలీసులను కలిసి విషయం చెప్పాడు. సీన్‌లోకి ఎంటరైన పోలీసులు.. యశోదను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపారు.
ఇలా చాలా మంది హనీట్రాప్‌నే ఉద్యమంలా చేస్తున్నారు. యశోద లాంటి వాళ్లకు తోడుగా సైబర్ నేరగాళ్లు కూడా చెలరేగిపోతున్నారు..వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియాలో తొలుత మెసేజ్ చేయడమో.. వీడియో కాల్ చేయడమో చేస్తారు. అవతలి వ్యక్తులు వీడియో కాల్ లిఫ్ట్ చేయగానే… స్క్రీన్ మీద పోర్న్ వీడియోలు లేదా అవతల వ్యక్తి లైవ్‌లో నగ్న దృశ్యాలు పంపుతున్నారు. ఆ దృశ్యాలను వీడియో కాల్ లిఫ్ట్ చేసిన సదరు వ్యక్తి చూస్తున్నంత సేపు స్ర్కీన్ రికార్డు, లేదా స్ర్కీన్ షాట్ తీస్తున్నారు. ఆ కాల్ కట్ చేసి తర్వాత మరల అదే వ్యక్తికి ఆ రికార్డింగ్‌ను పంపిస్తున్నారు. తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే.. ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఆ వీడియో కాల్ వ్యవహారంలో తాము మోసపోయిన విషయాన్ని ఎవరికి చెప్పుకోలేక, పరువు పోతుందని కొందరు భావిస్తే.. మరికొందరు వాళ్లు అడిగిన డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇంకొందరు ఏం చేయాలో తెలియక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తమ వలకు చిక్కిన వాళ్ల దగ్గర నుంచి సైబర్ నేరగాళ్లు డబ్బు గుంజి బాధితులను పీల్చి పిప్పి చేస్తున్నారు. బాధితులకు వీడియో కాల్, లేదా మెసేజ్‌లు వచ్చే నెంబర్లకు ఫోన్ చేసినా.. స్విచ్ఛాప్ వస్తోంది. అందుకే.. మోసగాళ్ల ఉచ్చులో ఉండాలనే అనౌన్ కాల్స్, మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..