మోగిన తుపాకీ మోత.. పెళ్లి కోసం ఇంటికొస్తే.. పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది..!
పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది. చిన్నపాటి గొడవతో మొదలై చివరకు కాల్పులకు దారితీసింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది.

పార్కింగ్ వివాదం ప్రాణాలు తీసింది. చిన్నపాటి గొడవతో మొదలై చివరకు కాల్పులకు దారితీసింది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన ఈ ఘటన షాక్‌కు గురిచేస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరి మధ్య పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర హింసకు దారితీసింది. పరమ్‌జీత్ ధన్‌ఖర్‌పై పొరుగింటి వ్యక్తి కాల్పులకు దిగాడు. లైసెన్స్‌డ్ పిస్టల్‌తో ఏకంగా 15 నుంచి 16 రౌండ్ల వరకు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో పరమ్‌జీత్ ధన్‌ఖర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
కాల్పుల అనంతరం నిందితుడు తన కుటుంబంతో కలిసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది…? పాత కక్షలేమైనా ఉన్నాయా…? అన్న కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. పరారైన నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. పార్కింగ్ వివాదం ఇంతటి ఘోరానికి దారితీయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మొత్తంగా… చిన్నపాటి వివాదాలు ఎంతటి ఘోరాలకు దారితీస్తాయో ఈ ఘటన మరోసారి గుర్తుచేస్తోంది. చిన్న మాటలకే పట్టలేని కోపంతో ఊగిపోయి నిందితుడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
