AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sundar Pichai: 15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే ఈ రూల్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

విజయానికి కావాల్సింది పెద్ద పెద్ద ఆర్భాటాలు కాదు.. క్రమశిక్షణతో కూడిన సాధారణ అలవాట్లేనని నిరూపిస్తున్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. 15 ఏళ్లుగా మారని బ్రేక్‌ఫాస్ట్ మెనూ నుంచి 7 గంటల నిద్ర, న్యూస్‌పేపర్ రీడింగ్, వీకెండ్ హైకింగ్ వరకు.. ప్రపంచ టెక్ దిగ్గజాన్ని సమర్థవంతంగా నడిపించే ఆయన మార్నింగ్ దినచర్య, ఫిట్‌నెస్ సూత్రాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శం.

Sundar Pichai: 15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే ఈ రూల్స్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Google Ceo Sundar Pichai Daily Morning Routine
Krishna S
|

Updated on: Nov 08, 2026 | 7:20 AM

Share

ప్రపంచంలోనే అగ్రగామి టెక్నాలజీ దిగ్గజం ఆల్ఫాబెట్ – గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్ తీసుకునే ఒక్క నిర్ణయం ప్రపంచ టెక్ రంగాన్ని ప్రభావితం చేస్తుంది. వందల కోట్ల డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే ఆయన వ్యక్తిగత జీవితం, దినచర్య ఎంత క్లిష్టంగా ఉంటుందోనని చాలామంది అనుకుంటారు. కానీ పిచాయ్ జీవనశైలి అత్యంత సాధారణంగా, క్రమశిక్షణతో కూడి ఉంటుంది. ముఖ్యంగా గత 15 సంవత్సరాలుగా ఆయన తన బ్రేక్‌ఫాస్ట్‌లో ఎలాంటి మార్పులూ లేకుండా దాదాపు ఒకే రకమైన ఆహారాన్ని తీసుకుంటుండటం విశేషం.

ఒకే అల్పాహారం వెనుక డెసిషన్ ఫెటీగ్ సైన్స్..

సుందర్ పిచాయ్ ప్రతిరోజూ ఉదయం ఆమ్లెట్ లేదా ఉడకబెట్టిన గుడ్లు, టోస్ట్ చేసిన బ్రెడ్ ముక్కలు, వేడి వేడి టీ మాత్రమే తీసుకుంటారు. ఒక అంతర్జాతీయ టెక్ దిగ్గజానికి అధిపతిగా ఉంటూ 15 ఏళ్ల పాటు ఇలా ఒకే ఆహారాన్ని కొనసాగించడం వెనుక బలమైన కారణం ఉంది. ఆధునిక మనస్తత్వశాస్త్రంలో దీనిని డెసిషన్ ఫెటీగ్ అంటారు. స్టీవ్ జాబ్స్ రోజూ ఒకే రకమైన నల్లటి టీషర్ట్ ధరించడం, మార్క్ జుకర్‌బర్గ్ ఒకే తరహా గ్రే టీషర్ట్‌లు వేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదే. ఉదయాన్నే ‘‘ఏం తినాలి? ఏం వేసుకోవాలి?’’ వంటి చిన్న చిన్న విషయాల కోసం మెదడుపై ఒత్తిడి పెట్టకుండా కీలకమైన వ్యాపార, వ్యాపారేతర నిర్ణయాల కోసం తమ మానసిక శక్తిని ఆదా చేసుకోవడానికే పిచాయ్ ఈ అలవాటును కొనసాగిస్తున్నారు.

ప్రశాంతమైన ఉదయం.. న్యూస్‌పేపర్‌తోనే ప్రారంభం

చాలామంది టెక్ దిగ్గజాలు ఉదయం 4 లేదా 5 గంటలకే మేల్కొంటారని చెబుతుంటారు. కానీ పిచాయ్ మాత్రం ఉదయం 6:45 నుంచి 7:30 గంటల మధ్య నిదానంగా నిద్రలేస్తారు. మేల్కొన్న వెంటనే ఫోన్లు, ఈమెయిళ్లు చూడకుండా తన ఉదయాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతారు. ఉదయం వేడి టీ తాగుతూ భౌతిక రూపంలో ఉండే వార్తాపత్రికలను చదవడానికి ఆయన ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా ది వాల్ స్ట్రీట్ జర్నల్, ది న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ దినపత్రికలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఆయన రోజువారీ ఆఫీస్ పనుల్లోకి దిగుతారు.

7 గంటల నిద్ర తప్పనిసరి.. నైట్ పర్సన్..

సాధారణంగా ఎక్కువమంది బిజినెస్ లీడర్లు నిద్రను త్యాగం చేస్తుంటారు. అయితే సుందర్ పిచాయ్ మాత్రం రాత్రిపూట కనీసం 6 నుంచి 7 గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా చూసుకుంటారు. పగటిపూట తీవ్రమైన పని ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే తగినంత శారీరక విశ్రాంతి ఉండాల్సిందేనని ఆయన బలంగా నమ్ముతారు.

ఫిట్‌నెస్ మంత్ర: హైకింగ్, సైక్లింగ్, నడక

బిజీ షెడ్యూల్ వల్ల వారంలో సోమవారం నుంచి గురువారం వరకు సమయాన్ని బట్టి వ్యాయామం చేసినా, శుక్రవారం సాయంత్రం నుంచి వారాంతాల్లో మాత్రం ఫిట్‌నెస్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తారు. జిమ్‌లోనే గడపడం కాకుండా ప్రకృతి నడుమ నడవడం, పర్వత ప్రాంతాల్లో హైకింగ్ చేయడం ఆయనకు ఎంతో ఇష్టం. మానసిక ఉల్లాసం, శారీరక దృఢత్వం కోసం సైక్లింగ్ చేస్తుంటారు. ఎంత ఎదిగినా సాదాసీదా జీవనం, అనవసర విషయాల్లో సమయం వృథా చేయకపోవడం, శారీరక-మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడమే సుందర్ పిచాయ్ అసాధారణ విజయానికి అసలైన పునాదులు.

Follow Us
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..
శని శుక్రుల అనుగ్రహం..అనూహ్య మార్గాల్లో వీరికి డబ్బే డబ్బు..
శని శుక్రుల అనుగ్రహం..అనూహ్య మార్గాల్లో వీరికి డబ్బే డబ్బు..
ఈ స్వీట్స్ కిలో రూ.1.25 లక్షలు! ఇందులో ఏముందో తెలిస్తే షాక్!
ఈ స్వీట్స్ కిలో రూ.1.25 లక్షలు! ఇందులో ఏముందో తెలిస్తే షాక్!