AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : అప్పుడు స్టార్ హీరోల పక్కన.. ఇప్పుడు అపార్ట్‏మెంట్ వాచ్‏మెన్.. ఈ నటుడి పరిస్థితి చూస్తే..

సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడి లైఫ్ ఊహించని విధంగా మలుపులు తిరిగింది. జీవితంలో ఎదురైన విషాదాలు అతడిని ఒంటరిని చేశాయి. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆ నటుడు అపార్ట్ మెంట్ వాచ్ మెచ్ గా పనిచేస్తున్నాడు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాననే నమ్మకంతో ఉన్నారు.

Tollywood : అప్పుడు స్టార్ హీరోల పక్కన.. ఇప్పుడు అపార్ట్‏మెంట్ వాచ్‏మెన్.. ఈ నటుడి పరిస్థితి చూస్తే..
Savi Sidhu
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2026 | 7:23 AM

Share

సినీ పరిశ్రమలో వెలుగు వెలిగే సెలెబ్రిటీల జీవితాలు ఎప్పుడూ విలాసవంతంగా, ఆర్భాటంగా కనిపిస్తాయి. కోట్ల రూపాయల సంపాదన, లక్షలాది మంది అభిమానుల ఫాలోయింగ్ మధ్య గడిపే నటుల వెనుక ఎప్పుడూ చీకటి కోణాలు కూడా ఉంటాయి. సినీ పరిశ్రమలో విజయం ఎంత అనివార్యమో, వైఫల్యం, విధి నిర్వహించే విపరీత పోకడలు అంతకంటే క్రూరంగా ఉంటాయి. ఒకప్పుడు అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న నటుడు, నేడు పూట గడవడం కోసం సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన జీవితం సినిమా ఇండస్ట్రీలోని కఠిన వాస్తవాలను కళ్లకు కడుతుంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన సంచలనాత్మక చిత్రం ‘బ్లాక్ ఫ్రైడే’లో కమీషనర్ సమ్రా పాత్రలో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటుడు సావి సింధు. ఆయన జీవితం అనూహ్య మలుపులు తిరిగింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : 90% హిట్లు ముందే ఊహిస్తా.. కానీ ఎన్టీఆర్ సినిమాల విషయంలో సీన్ రివర్స్ అయింది.. ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేష్

ఈ నటుడు కేవలం ‘బ్లాక్ ఫ్రైడే’ మాత్రమే కాకుండా, ‘గులాల్’, నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో అక్షయ్ కుమార్, డింపుల్ కపాడియా, రిషి కపూర్ వంటి దిగ్గజ తారలతో కలిసి ప్రతిష్టాత్మక ‘పాటియాలా హౌస్’ చిత్రంలోనూ కీలక పాత్రలు పోషించారు. యష్ రాజ్ ఫిల్మ్స్, సుభాష్ ఘాయ్ వంటి ప్రముఖుల బ్యానర్‌లలో పని చేసిన సావి సింధు, ఒక సమయంలో ఇండస్ట్రీలో బిజీ నటుడిగా మారారు. అయితే, జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. సావి సింధు వ్యక్తిగత జీవితంలో వరుస విషాదాలు కుప్పకూలాయి. ముందుగా ఆయన భార్య మరణించారు. ఆ తర్వాత తండ్రి, తల్లి , అత్తమామలు కూడా వరుసగా కన్నుమూశారు. కుటుంబ సభ్యుల మరణాలు ఆయనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశాయి. ఈ ఒంటరితనం, ఆర్థిక సమస్యలు , ఆరోగ్యం క్షీణించడం వంటి పరిణామాలు ఆయనను పూర్తిగా కుంగదీశాయి. ఒక దశలో సినిమాలపై దృష్టి పెట్టలేక, వచ్చిన అవకాశాలను కూడా వదులుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఎక్కువ మంది చదివినవి : Trending Song : ఏముంటది మావ ఈ సాంగ్.. స్టార్ హీరోహీరోయిన్ లేకపోయినా సెన్సేషనల్ హిట్.. మిలియన్ వ్యూస్‏తో యూట్యూబ్ షేక్..

ప్రస్తుతం ముంబైలోని ఒక హౌసింగ్ సొసైటీలో రోజువారీ పన్నెండు గంటల షిఫ్ట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా విధులను నిర్వహిస్తున్నారు సావి సింధు. ఒకప్పుడు సినిమా థియేటర్లలో వెండితెరపై కనిపించిన ఆయన, ఇప్పుడు కనీసం సినిమా టికెట్ కొనుగోలు చేయడానికి కూడా డబ్బుల్లేక, బయట సినిమాలను కేవలం దూరం నుంచే తలచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఇండస్ట్రీని లేదా ఎవరినీ తాను తప్పుపట్టనని, పరిస్థితుల ఒత్తిడి వల్లే ఈ స్థాయికి చేరానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ, సావి సింధు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ, తాను మళ్లీ నటనారంగంలోకి బలమైన రీఎంట్రీ ఇవ్వాలని ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోలతో కలిసి పనిచేసిన కళాకారుడు నేడు పడుతున్న ఈ పోరాటం, చిత్ర పరిశ్రమలోని అనిశ్చితికి , జీవన పోరాటానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Jayachitra: ఆ హీరో డైలాగ్ చెబితే సింహం గర్జనలా ఉంటుంది.. కానీ సెట్ లో చేసే అల్లరి మాములుగా ఉండదు.. సీనియర్ హీరోయిన్..

సావి సిద్ధు..

Savi Sidhu Life

Savi Sidhu Life

ఎక్కువ మంది చదివినవి : VV Vinayak : ఆ హీరోతో సినిమా చేయాలని చాలాసార్లు అనుకున్నా.. ప్రతిసారి మిస్సయ్యింది.. డైరెక్టర్ వివి వినాయక్..

Follow Us
‏ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. ఇప్పుడు బతుకుదేరువు కోసం వాచ్‏మెన్‏గా
‏ఇండస్ట్రీలోనే తోపు నటుడు.. ఇప్పుడు బతుకుదేరువు కోసం వాచ్‏మెన్‏గా
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
మరికొద్దిసేపట్లో హైఓల్టేజీ మ్యాచ్.. రికార్డుల్లో తోపు ఎవరంటే?
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
15 ఏళ్లుగా ఒకే టిఫిన్.. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పాటించే..
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
ఇంట్లో బట్టలు ఆరవేస్తున్నారా? ఈ సమస్యలు కొనితెచ్చుకున్నట్లే!
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
అరెరే.. రంగు చూసి మోసపోకండి.. కెమికల్ అరటిపండ్లను చిటికెలో..
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
ఈ రైలు 7 గంటల్లో 6 రాష్ట్రాలను దాటుతూ, 527 కిలోమీటర్లు!
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
నవంబర్‌ 11 నుంచి DSC 2026 ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం.. లింక్
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
8 నెలలు చెప్పులు లేకుండా.. నేలపై పడుకునేవాడిని..
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
దీపావళి లక్ష్మీ పూజ ఎలా చేయాలి? శుభ సమయం, పూజా సామాగ్రి, మంత్రాలు
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..
100 ఏళ్ల క్రితం దీపావళి.. ఆ 11 ప్రమిదల వెనుక దాగున్న కన్నీటి..