Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

సుదీర్ఘ చర్చ తర్వాత ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ప్రతిపాదించిన సవరణలన్నీ కూడా రాజ్యసభలో ఉంచారు. అయితే సభలో ఈ బిల్లుకు 454 ఓట్లు అనుకూలంగా రాగా, 2 ఓట్లు మాత్రం వ్యతిరేకంగా వచ్చాయి. బిల్లును ఆమోదించిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రతి ఒక్కరినీ అభినందించారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023,,

Women Reservation Bill: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
Women's Reservation Bill

Edited By:

Updated on: Sep 22, 2023 | 7:14 AM

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు 214 మంది సభ్యులు ఆమోదం తెలిపారు. ఇప్పటికే ఈ మహిళా రిజర్వేషన్‌ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌లను కల్పించనున్నారు. మహిళా బిల్లుపై రాజ్యసభలో 10 గంటలకుపైగా చర్చ కొనసాగింది. అయితే నూతన పార్లమెంట్‌లో ఆమోదం పొంది చారిత్రాత్మక బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.

సుదీర్ఘ చర్చ తర్వాత ఈ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ప్రతిపాదించిన సవరణలన్నీ కూడా రాజ్యసభలో ఉంచారు. లోక్‌సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 454 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 2 ఓట్లు వచ్చాయి. ఈ బిల్లులో లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నదానిపై ఆమోదం లభించింది. బిల్లును ఆమోదించిన సందర్భంగా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖర్ ప్రతి ఒక్కరినీ అభినందించారు.

ఇవి కూడా చదవండి

కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ రాజ్యాంగ (128వ సవరణ) బిల్లు, 2023ని రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బిల్లు మహిళా సాధికారతకు సంబంధించినదని, ఇది చట్టంగా మారిన తర్వాత 543 మంది సభ్యులున్న లోక్‌సభలో ప్రస్తుత మహిళా సభ్యుల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని చెప్పారు. అలాగే, అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్ కల్పించనున్నారన్నారు.

దీని కింద ఎస్సీ-ఎస్టీ మహిళలకు కూడా రిజర్వేషన్లు వస్తాయని తెలిపారు. అందువల్ల జనాభా లెక్కలు, అలాగే డీలిమిటేషన్ ముఖ్యమైనవి. బిల్లు ఆమోదం పొందిన వెంటనే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ జరుగుతాయి. ఇది రాజ్యాంగ ప్రక్రియ. మహిళలకు ఏయే సీట్లు రావాలో డీలిమిటేషన్ కమిషన్ నిర్ణయిస్తుంది. గురువారం రాజ్యసభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది.

ఎంపీలందరికీ కృతజ్ఞతలు:

రాజ్యసభలో బిల్లుపై ఓటింగ్‌కు ముందు, ఈ బిల్లు దేశ ప్రజల్లో కొత్త విశ్వాసాన్ని కలిగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహిళా సాధికారత, మహిళా శక్తిని పెంపొందించడంలో అన్ని సభ్యులు, రాజకీయ పార్టీలు ముఖ్యమైన పాత్ర పోషించాయి. కానీ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఈ బిల్లు పట్ల సానుకూలంగా ఆలోచించడం మన దేశ మహిళా శక్తికి కొత్త శక్తిని ఇవ్వబోతోంది. సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని, అయితే ఏయే సీట్లు ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో సెమీ జ్యుడీషియల్ బాడీ నిర్ణయించదని నడ్డా అన్నారు. దీనికి రెండు విషయాలు ముఖ్యమైనవి. జనాభా లెక్కలు, డీలిమిటేషన్. దీని తరువాత, పబ్లిక్ హియరింగ్ ఉండాలి, ఆపై సీట్లు, సంఖ్యలను నిర్ణయించాలి. అలాగే దానిని ముందుకు తీసుకెళ్లాలి అని అన్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి