Himachal Pradesh: కులులో ఘోర ప్రమాదం.. 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. డ్రైవర్ మృతి.. పలువురికి గాయాలు

|

Dec 10, 2024 | 3:19 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని కులులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ బస్సు లోతైన లోయలో పడింది. ఆ తర్వాత ఆ బస్సు ముక్కలైంది. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.

Himachal Pradesh: కులులో ఘోర ప్రమాదం.. 200 అడుగుల లోతైన లోయలో పడిన బస్సు.. డ్రైవర్ మృతి.. పలువురికి గాయాలు
Kullu Bus Accident
Follow us on

హిమాచల్ ప్రదేశ్‌ కులులోని అనిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇక్కడ ఓ ప్రైవేట్ బస్సు అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది. బస్సు పూర్తిగా ధ్వంసమైంది. బస్సు శిధిలాలు లోయలో చెల్లాచెదురుగా పడి పోయాయి. అనీలోని షకేల్‌హార్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో పలువురు మృతి చెందే అవకాశం ఉంది.

సమాచారం ప్రకారం కులులోని అని సబ్ డివిజన్‌లోని స్వాద్-నాగన్ రహదారిపై ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. బస్సులో 25 నుంచి 30 మంది వరకు ఉన్నారని, ఈ బస్సు కర్సోగ్ నుంచి వస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. అయితే ప్రాథమిక నివేదికల ప్రకారం డ్రైవర్ నిటారుగా ఉండే మలుపులో బస్సుని నియంత్రణ చేయలేకపోయాడు. దీంతో బస్సు దాదాపు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. చాలా మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యారు. బస్సు చుట్టూ పడిపోయారు. వెంటనే స్పందించిన స్థానికులు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. అదే సమయంలో పోలీసు అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు.

బస్సులో మొత్తం 25 నుంచి 30 మంది ప్రయాణికులు ఉన్నారని కులు డీసీ ఎస్ రవీష్ తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ మృతి చెందాడు. గాయపడిన మిగిలిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలించే పనులు కొనసాగుతున్నాయి. తమ బృందం సంఘటనా స్థలంలోనే ఉందని చెప్పారు. చుట్టుపక్కల ఉన్నవారు తమ వాహనాల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన తర్వాత ఓ వీడియో కూడా బయటకు వచ్చింది. కాలువలో పడిన వెంటనే బస్సు ఎలా ధ్వంసమైందో అందులో చూపించారు. ఎంతో కష్టం మీద స్థానికులు బస్సులో ప్రయాణిస్తున్న వారిని బయటకు తీశారు. గాయపడిన వారిలో కొందరు బయటకు వచ్చేందుకు కూడా ప్రయత్నించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. అప్పుడు బస్సు లోయలో పడిపోవడం కనిపించింది.. ఆ బస్సులో ఉన్న ప్రయాణీకులు అరుస్తున్న శబ్దాలు వినిపించాయని చెప్పారు.

సహాయక చర్యలు చేపట్టిన స్థానికులు

స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులకు సహాయం చేయడం ప్రారంభించారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం అందించారు. క్షతగాత్రులను హుటాహుటిన అందుబాటులో ఉన్న వాహనాలతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదంలో ఎంత మంది మరణించారనే దానిపై కచ్చితమైన సమాచారం అందుబాటులో లేదు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..