Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్..

Himachal Bypoll Results - Congress: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఘోర పరాభ‌వాన్ని చవిచూసింది. హిమాచ‌ల్ ప్రదేశ్‌ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీ చేసిన లోక్‌సభతోపాటు

Himachal Bypoll Results: బీజేపీకి భారీ షాక్.. హిమాచల్ ప్రదేశ్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్‌స్విప్..
Congress

Updated on: Nov 02, 2021 | 4:08 PM

Himachal Bypoll Results – Congress: హిమాచల్ ప్రదేశ్‌లో అధికార భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ఘోర పరాభ‌వాన్ని చవిచూసింది. హిమాచ‌ల్ ప్రదేశ్‌ ఉప ఎన్నిక‌ల్లో ఆ పార్టీ పోటీ చేసిన లోక్‌సభతోపాటు పలు అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. మండి లోక్‌స‌భ స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఘన విజ‌యం సాధించింది. హిమాచల్‌ ప్రదేశ్‌లో అక్టోబర్‌ 30న మండి పార్లమెంట్‌ స్థానంతోపాటు ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బల్ కోట్‌ఖాయ్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది.

మండి పార్లమెంటరీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌ భార్య, కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతిభా సింగ్‌.. బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్‌ కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఫ‌తేపూర్‌, ఆర్కీ, జుబ్బల్‌ అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది. ఫ‌తేపూర్ నుంచి భ‌వానీ సింగ్‌, ఆర్కీ నుంచి సంజ‌య్‌, జుబ్బల్‌ నుంచి రోహిత్ ఠాకూర్‌ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్‌ శ్రేణులు వేడుకలు నిర్వహించుకుంటున్నారు. కాగా.. 2022 వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఘోర పరాజయం పాలవ్వడంతో.. ఆ పార్టీ నాయకులు నిరాశలో కూరుకుపోయారు.

Also Read:

Road Accident: టీ తాగుతుండగా.. ట్రక్కు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. ఆరుగురు దుర్మరణం..

Video Viral: కర్ణాటక సీఎంపై మహిళ ముద్దుల వర్షం.. వైరల్ అయిన వీడియో..