Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Price: గుదిబండగా మారిన గ్యాస్ ధర.. మళ్ళీ కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలు

ఓ వైపు కరోనా వైరస్ తెచ్చిన కల్లోలం.. ఆర్ధిక ఇబ్బందులతో ప్రజలు సతమవుతుంటే.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో నానాతంటాలు పడుతున్నారు. కోవిడ్ ప్రబలిన తర్వాత సరైన పనులు లేక.. ఆర్ధికంగా..

LPG Cylinder Price: గుదిబండగా మారిన గ్యాస్ ధర.. మళ్ళీ కట్టెల పొయ్యినే ఆశ్రయిస్తున్న పేద, మధ్యతరగతి ప్రజలు
Gas Price Hike
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2021 | 1:08 PM

LPG Cylinder Price: ఓ వైపు కరోనా వైరస్ తెచ్చిన కల్లోలం.. ఆర్ధిక ఇబ్బందులతో ప్రజలు సతమవుతుంటే.. మరోవైపు రోజు రోజుకీ పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో నానాతంటాలు పడుతున్నారు. కోవిడ్ ప్రబలిన తర్వాత సరైన పనులు లేక.. ఆర్ధికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద, మధ్యతరగతి ప్రజలకు షాక్ ఇస్తూ.. ఇటీవల ఎల్పీజీ ధరలు భారీగా పెరిగాయి. గ్యాస్ బండ ధర పెరిగి గుదిబండగా మారింది. దీంతో కొంతమంది పేద వారు గ్యాస్ మీద వంట అంటే అది మాగుండెల్లో మంటే అంటున్నారు. ఇక మరికొందరు తిరిగి గతంలో అంటే వంట గ్యాస్ లేని సమయంలో ఎలా వంట చేసుకున్నామో.. అలా ఇప్పుడు చేసుకుంటే పోలె అంటున్నారు కూడా.. ఆ మాటను నిజం చేస్తూ.. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ కుటుంబం ఎల్పీజీ గ్యాస్ వాడడం మానేసి.. తిరిగి కట్టెల పొయ్యను వంట కోసం ఆశ్రయించింది. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తర ప్రదేశ్‌లోని బాగ్సర గ్రామంలో నిషా ఆమె మహిళ వంటను కట్టెల పొయ్యమీద చేస్తుంది. తన ఐదుగురు కుమార్తెలతో సహా కుటుంబం కోసం కట్టెల ను మండిస్తూ ఆ పొగ మద్య మళ్లీ వంట చేస్తుంది నిషా. తమ ఫ్యామిలీకి గ్యాస్ ను ఖరీదు చేసే స్తొమత లేదని.. అందుకనే వంట చేరుకునే ఇంధనంగా ఉపయోగిస్తున్నామని తెలిపింది. తన భర్త గ్యాస్ కోసం అంత మొత్తాన్ని ఖర్చు పెట్టలేదని తెలిపింది. అయితే నిషా ఫ్యామిలీకి మూడేళ్ల క్రితం ప్రధాన్ మంత్రి ఉజ్జ్వాల యోజన (పిఎంయువై) కింద ఎల్‌పిజి కనెక్షన్ వచ్చింది. కానీ సిలిండర్ల ధర బాగా పెరగడంతో ఆమెకు గ్యాస్ మీద వంట తలకు మించినభారంగా మారింది.. ఇటీవల పెరిగిన సిలెండర్ ధరలు తమకు చాలా ఖర్చుతో కూడుకున్నవని అందుకనే తిరిగి కట్టెల పొయ్యమీద వంట చేసుకుంటున్నామని తెలిపింది. ఒక్క నిషానే కాదు దేశం లో అనేక మంది పేద, మధ్యతరగతి ప్రజలకు పెరిగిన గ్యాస్ ధరలు భారంగా మారాయి. తిరిగి కట్టేల పొయ్యిని ఆశ్రయించేలా చేస్తున్నాయి.

మార్చి నెల ప్రారంభంలో దేశీయ ఎల్పీజీ ధర రూ 25 పెరిగి.. కొన్ని ప్రాంతాల్లో రూ.826కి చేరింది. గత రెండు నెలలుగా గ్యాస్ ధర పెంచుతూనే ఉన్నారు. దేశంలో ఇటు గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగినా ప్రభుత్వ సబ్సిడీ మాత్రం వినియోగదారిడి బ్యాంకు అకౌంట్లలో పడడం లేదు. దీంతో క్రమంగా గ్యాస్ వినియోగదారుడి ఖాతాలలో ఉన్న డబ్బు బదిలీల రూపంలో తగ్గుపోతూ వస్తుంది ప్రస్తుతం ఇండియాలో వంట గ్యాస్ వాడుతున్నవారి సంఖ్య 27.87 కోట్లు ఉండగా.. అందులో ఐదేళ్ళ క్రితం అంటే 2015లో కేవలం 14.86 కోట్లు ఉండేది

Also Read: ద్యేవుడా ఇలా కూడా ఆడుతారా!.. నాలుగు బంతుల్లోనే మ్యాచ్ ఫినిష్.. క్రికెట్ చరిత్రలోనే ఇదో వింత రికార్డ్..

బరువు తగ్గాలనుకుంటున్నారా.. అరటిపండు ట్రై చేయండి.. అయితే ఏరకం పండ్లు మంచివో తెలుసా..!