Heavy Rains in Tamil Nadu: తమిళనాడులో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం.. నీటి మునిగిన ఇళ్లు.. స్తంభించిన జనజీవనం..
Heavy Rains in Tamilnadu: తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో..
Heavy Rains in Tamil Nadu: తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, తిరునల్వేలి, తెన్‌కాశి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో ఆయా జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇక పాళ, అంబై, నాంగునేరి, రాధాపురం, చేరన్ మహాదేవి, పాపనాశం తదితర ప్రాంతాల్లో ఆదివారం మధ్యాహ్నం నుంచి చెదరుమదురుగా వర్షాలు కురుస్తున్నాయి. తూత్తుకుడి, సాత్తాన్‌కుళం, తిరుచ్చేందూరు, కాయల్ పట్టిణం, కులశేఖరన్ పట్టిణం, శ్రీవైకుంఠం, సూరంగుడి, వైప్పారు ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. ఇక ఈ వర్షాల కారణంగా తూత్తుకుడిలోని పూల్ పాండియపురం, దిరేష్‌పురం, లూర్థుమ్మాళ్‌పురం, అన్నై థెరెసానగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లో సుమారు 200 నివాస గృహాలు నీట మునిగాయి.
కురుక్కుతురైలోని మురుగన్ ఆలయం, తైపూస మండపాలు వరదనీటిలో మునిగాయి. మరోవైపు పాపనాశం, మణిముత్తారు, సేర్వలారు జలాశయాల్లో నీటి మట్టాలు పెరిగాయి. దాంతో అప్రమత్తమైన అధికారులు.. ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక సింగై, అంబై, కల్లిడకురిచ్చి, వీరవానల్లూరు, చేరన్‌మహాదేవి, నెల్లై, కురుక్కుతురై ప్రాంతాలలోని వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి. కాగా, తిరునల్వేలి జిల్లాలో కల్లకాడులో 52.2 మిల్లీమీటర్లు, టవున్ ప్రాంతంలో ప్రాంతంలో 40 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక తూత్తుకుడి జిల్లాలోని వేడనత్తంలో 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also read:
Red Movie: రామ్ ‘రెడ్’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు..