Central Government vs Farmers Live update : సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు.. రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ

| Edited By: Team Veegam

Updated on: May 22, 2021 | 3:28 PM

కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం వాదాపవాదాలను ..

Central Government vs Farmers Live update : సుప్రీం కోర్టు కీలక ఉత్తర్వులు.. రైతుల సమస్యల పరిష్కారానికి కమిటీ

కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను నిలుపుదల చేస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారం జరిగిన సదీర్ఘ వాదోపవాదాల అనంతరం సుప్రీంకోర్టు తీర్పు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నూతన వ్యవసాయ చట్టాల అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సమస్య పరిష్కారానికి కమిటీని వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Jan 2021 02:49 PM (IST)

    ఢిల్లీ పోలీసుల విజ్ఞప్తిపై రైతు సంఘాలకు నోటీసులు..

    రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా ట్రాక్టర్ ర్యాలీని ఆపాలంటూ సుప్రీం కోర్టును ఢిల్లీ పోలీసులు ఆశ్రయించారు. దీనిపై రైతు సంఘాలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది.

  • 12 Jan 2021 02:27 PM (IST)

    సమస్య పరిష్కారం దిశగానే సుప్రీంకోర్టు మొగ్గు

    ఈ ఉదయం నుంచి సుప్రీంకోర్టులో కీలక విచారణ జరుగుతోంది. కేంద్రం తీరుపై నిన్న అసహనం వ్యక్తం చేసిన కోర్టు.. ఇవాళ ఇచ్చిన ఉత్తర్వులు మరింత సంచలనం అని చెప్పాలి. అసలు ప్రభుత్వమే చట్టాలను నిలుపుదల చెయ్యలేదా అని ప్రశ్నించిన కోర్టు.. చివరికి మ్యాటర్‌ని కమిటీకి సిఫార్సు చేసింది. రైతులు ఏ సమస్యలున్నా.. కమిటీకి చెప్పుకోవచ్చని సూచించింది.

    అయితే కోర్టు ఏర్పాటు చేయబోయే కమిటీ ముందుకు రైతులు వెళ్తారా అని కూడా ప్రశ్నించింది కోర్టు. కానీ రైతులు అందుకు విముఖత చూపించారు. అయినా నలుగురితో కమిటీ ఏర్పాటు చేసింది సుప్రీం. అందులో హర్‌సిమ్రాత్‌ మాన్‌, ప్రమోద్‌జోషీ, అశోక్ గులాటీ, అనిల్‌ ధన్వంత్‌ సభ్యులుగా ఉండబోతున్నారు.

    అందరి వాదనలు విన్న ధర్మాసనం.. చివరకు సమస్య పరిష్కారం దిశగానే మొగ్గు చూపింది. ఒక సొల్యూషన్ దొరికేదాకా.. చట్టాల అమలును నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చింది. పూర్తి తీర్పు వచ్చేదాక దీన్నే అమలు చెయ్యాలని సూచించింది.

  • 12 Jan 2021 02:21 PM (IST)

    క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకే కమిటీ..- సుప్రీం కోర్టు

    క్షేత్ర స్థాయిలో పరిస్థితి తెలుసుకునేందుకే కమిటీ వేయాలని అనుకుంటున్నామని సుప్రీం వ్యాఖ్యానించింది. సమస్యలను పరిష్కరించడంలో నిజంగా ఆసక్తి ఉన్న అందరూ.. కమిటీకి ముందుకు వెళ్లాలని పేర్కొంది. రైతులు ప్రభుత్వం ముందుకు వెళ్ళగలిగితే కమిటీ ముందుకు ఎందుకు వెళ్లరని సీజేఐ ప్రశ్నించారు.

    "ఎటువంటి పరిష్కారం లేకుండా ప్రదర్శన చేయవలసి వస్తే.. అది నిరవధికంగా జరుగుతూనే ఉంటుంది. ఎటువంటి పరిష్కారం ఉండదు. పరిష్కారం కోసమే ఒక కమిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. షరతులతో చట్టాన్ని సస్పెండ్ చేయాలనుకుంటున్నాం. అయితే అది నిరవధికంగా కాదు." - సుప్రీం కోర్టు

  • 12 Jan 2021 02:18 PM (IST)

    అటార్నీ జనరల్‌కు సీజేఐ సూటి ప్రశ్న...

    రైతు నిరసనలకు నిషేధిత సంస్థ ఒకటి సహకరిస్తోందంటూ ఒక దరఖాస్తు తమ ముందు ఉందని ఆయన పేర్కొంటూ, అటార్నీ జనరల్ దీనిని అంగీకరిస్తారా.. కాదంటారా అని సీజేఐ ప్రశ్నించారు. దీనికి అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ స్పందిస్తూ.. నిరసనల్లోకి ఖలిస్తానీలు చొరబడ్డారని మాత్రమే తాము చెప్పామని కోర్టుకు తెలిపారు.

  • 12 Jan 2021 02:14 PM (IST)

    జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ..

    రైతుల తరఫున వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ పిటిషన్లు వేసిన అడ్వకేట్ ఎంఎల్ శర్మ తన వాదనలు వినిపిస్తూ, కోర్టు ఏర్పాటు చేసే ఏ కమిటీ ముందు తాము హాజరు కావాలనుకోవడం లేదని రైతులు చెబుతున్నట్టు కోర్టుకు విన్నవించారు. చర్చలకు చాలా మందే వస్తున్నప్పటికీ ప్రధాన వ్యక్తి అయిన ప్రధానమంత్రి రావడం లేదని రైతులు అంటున్నట్టు కూడా ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.

    దీనికి సీజేఐ స్పందిస్తూ... ప్రధానిని చర్చలకు వెళ్లమని మేము చెప్పలేమని అన్నారు. ఈ కేసులో ఆయన పార్టీ కాదు అని పేర్కొన్నారు. తమకున్న అధికారులతో సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయగలమని.. జ్యుడిషియల్ ప్రక్రియలో భాగమే కమిటీ అని.., చిత్తశుద్ధితో పరిష్కారం కోరుకునే రైతులు కమిటీ ముందుకు వెళ్లవచ్చని సీజేఐ పేర్కొన్నారు.

  • 12 Jan 2021 02:06 PM (IST)

    కమిటీ ఉత్తర్వు ఇవ్వదు.. మిమ్మల్ని శిక్షంచబోదు.. నివేదికను మాత్రమే మాకు ఇస్తుంది..

    కమిటీ అనేది మనందరి కోసమేనని, సమస్యను పరిష్కరించాలనుకునే వాళ్లంతా కమిటీ ముందు తమ అభిప్రాయాలు చెప్పవచ్చని సీజేఐ అన్నారు. కమిటీ ఉత్తర్వు ఇవ్వదు, మిమ్మల్ని శిక్షంచబోదు. నివేదికను మాత్రమే మాకు ఇస్తుంది  అని సీజేఐ పేర్కొన్నారు.

  • 12 Jan 2021 02:04 PM (IST)

    కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది..

    వ్యవసాయ చట్టాల చట్టబద్ధత, నిరసనల కారణంగా ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని తమకున్న అధికారాల పరిధిలో సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మనం ఒక కమిటీని ఏర్పాటు చేసుకుంటే ఒక స్పష్టత వస్తుంది అని చెప్పుకొచ్చారు. రైతులు కమిటీ వద్దకు వెళ్లరన్న దానిపై వాదనలు తాము వినదలచుకోలేదని, రైతులు నిరవధిక ఆందోళనలు చేయదలచుకుంటే చేసుకోవచ్చని అన్నారు.

  • 12 Jan 2021 02:00 PM (IST)

    సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం వాదాపవాదాలు నడిచాయి

    కేంద్రం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మంగళవారం మధ్యాహ్నం వాదాపవాదాలు నడిచాయి. తమకున్న హక్కులకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించేందుకు తాము ప్రయత్నిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ శరద్‌ బోబ్డే సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. చట్టాన్ని సస్పెండ్ చేసి కమిటీ వేయడం తమకున్న అధికారాల్లో ఒకటని సీజేఐ పేర్కొన్నారు.

Published On - Jan 12,2021 2:49 PM

Follow us