ట్రంప్ వాడిన లగ్జరీ కారుపై కేరళ జువెల్లర్ కన్ను, ఎంత ఖర్చైనా సరే, వేలంలో పాల్గొని సొంతం చేసుకుంటాడట.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని స్వీకరించేంతవరకు కొంతకాలం వాడిన అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును వేలంలో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పదవిని స్వీకరించేంతవరకు కొంతకాలం వాడిన అతి ఖరీదైన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును వేలంలో కొనాలనుకుంటున్నాడు కేరళకు చెందిన ఓ ప్రముఖ జువెల్లర్.. బాబీ చెమ్మూర్ అనే ఈ జువెల్లర్.. ఈ కారుకు జరిగే వేలంలో తాను కూడా పాల్గొంటానని, ఇందుకు టెక్సాస్ లోని తన కార్యాలయం అప్పుడే సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించాడు. లోగడ కేరళలో తన బంగారు ఆభరణాల షో రూమ్ ని ప్రారంభించేందుకు దివంగత ఫుట్ బాల్ లెజెండ్ డీగో మారడాను ఆహ్వానించాడన్న చరిత్ర ఈయనకు ఉంది. ప్రపంచం లోని అతి పెద్ద కార్ల వేలం సంస్థల్లో ఒకటైన అమెరికన్ బిడ్డింగ్ వెబ్ సైట్ ‘మెకం ఆక్షన్స్’ ట్రంప్ కారును వేలానికి పెట్టనుంది.
2010 మోడల్ కారయిన ఈ వాహనం రోల్స్ రాయిస్ ఉత్పత్తి చేసిన 537 కార్లలో ఒకటి. వేలంలో ఈ వాహనం 3 కోట్లకు పైగా అమ్ముడు పోవచ్చునని, అయినా తను వెనుకంజ వేయనని అంటున్నాడు బాబీ చెమ్మూర్.
Also Read:
Sankranti Festival: గాలిపటాలు ఎగిరేసేవారు ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా ? లేకపోతే అంతే సంగతులు..
కేంద్రానికి ’సుప్రీం‘ షాక్ .. కొత్త వ్యవసాయ చట్టాల అమలుపై స్టే.. ఇక ప్రత్యేక కమిటీ ముందు వాదనలు