Viral: ఈ రైలు టికెట్ యమా కాస్ట్లీ గురూ.. కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే.! తెలిస్తే షాకే..
దూరప్రాంతాలకు వెళ్లే చాలామంది ప్రజలు బస్సుల కంటే ట్రైన్‌లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే..

దూరప్రాంతాలకు వెళ్లే చాలామంది ప్రజలు బస్సుల కంటే ట్రైన్‌లో వెళ్లేందుకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే.. చాలా కారణాలే ఉంటాయి. అందులో ఒకటి టికెట్ ధరలు. బస్సులో ఎక్కువ డబ్బులకు టికెట్ కొని.. ఇరుక్కుని వెళ్లే బదులు ట్రైన్‌లో తక్కువ ధరకు స్లీపర్ క్లాస్ బెర్త్ బుక్ చేసుకుని హాయిగా పడుకుని వెళ్లిపోవచ్చు. మరి సంపన్నులైతే.. ఏసీ బోగీల్లో బుక్ చేసుకోవడం లేదా ఏకంగా బోగీనే బుక్ చేసుకుని వెళ్తుండటం మనం చూస్తూనే ఉంటాం. మరి ట్రైన్ టికెట్లలో అత్యంత ఖరీదైనది ఎంత రేటు ఉంటుందో తెలుసా.? ఆ రైల్లో విలాసవంతమైన సౌకర్యాలన్నీ దొరుకుతాయి. టికెట్ ధర వింటే మాత్రం షాక్ కావడం ఖాయం..
ఇంతకీ ఆ ట్రైన్ పేరు ఏంటని ఆలోచిస్తున్నారా.? అదేనండీ మహారాజ్ ఎక్స్‌ప్రెస్. ఈ రైలులో మీకు ఫైవ్ స్టార్ ట్రీట్‌మెంట్ దొరుకుతుంది. అది ట్రైనా లేక హోటలా అని అనిపిస్తుంది. ఇక టికెట్ ధర ఎంత అనుకుంటున్నారు.. అక్షరాలా రూ. 19 లక్షల పైమాటే. ఈ ట్రైన్‌ను ఇండియన్ రైల్వేస్ 2010వ సంవత్సరంలో పట్టాలెక్కించింది. అత్యంత సంపన్నులు ఈ రైలులో బుక్ చేసుకునే గదులను నవరత్న అని పిలుస్తారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. దానిపై మీరూ లుక్కేయండి.
View this post on Instagram
