Shalini Chouhan: వీడియో అదుర్స్.. నర్సుగా ఎంట్రీ ఇచ్చి.. ర్యాగింగాళ్ల దుమ్ము దులిపింది..!
దొంగల్ని, నేరస్థులను పట్టుకునేందుకు కొన్నిసార్లు పోలీసులు వివిధ గెటప్‌లు వేస్తుంటారు. మఫ్టీలో మాటు వేసి మరీ పట్టుకుంటారు. మధ్యప్రదేశ్‌లోని ఒక మహిళా పోలీస్ అచ్చం అలానే చేసింది.
ఎంబీబీఎస్ ఈ ఏడాది జూలైలో ఫస్టియర్ ఎంబీబీఎస్ విద్యార్థులను కొందరు ర్యాగింగ్ పేరుతో వేధించారు. వాట్సాప్ ద్వారా విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు ఈ కేసును షాలినికి అప్పగించారు. ర్యాగింగ్ కేసు అనుమానితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన షాలిని చౌహాన్ అండర్ కవర్ ఆపరేషన్ చేపట్టింది. అందుకోసం ఏకంగా కాలేజీ స్టూడెంట్‌గా మారింది. బీకామ్ చదివిన ఆమె నర్సుగా కాలేజీలో ఎంటర్ అయింది. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఫ్రెండ్స్ చేసుకుంది. షాలిని పోలీస్ అని ఎవరూ కనిపెట్టలేకపోయారు. ఆమె కాలేజీ క్యాంటీన్, క్యాంపస్‌లో రోజుకు 6 గంటలు ఉంటూ ర్యాగింగ్‌కు పాల్పడే వాళ్లను గమనించేది. సీక్రెట్ ఆపరేషన్ ద్వారా 11 మంది సీనియర్ విద్యార్థులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. వాళ్లపై సీఆర్‌పీఎఫ్ 41ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దాంతో, పలువురు షాలినిని అభినందిస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. కాగా షాలిని తండ్రి కూడా పోలీస్‌గా పనిచేసేవారు. అయితే ఆయన 2010లో చనిపోవడంతో షాలిని పోలీస్ అవ్వాలని నిర్ణయించుకుంది. ఖాకీ చొక్కా వేసుకొని మొదటి కేసునే విజయవంతంగా ఛేదించి ప్రశంసలు అందుకుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Rat Job: ఎలుకల్ని పట్టుకుంటే ..రూ. కోటి 38 లక్షల జీతం..! కొత్త పోస్ట్‌కు మేయర్ ప్రకటన..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

