హత్రాస్ కేసు విచారణ యూపీలో వద్దు, లాయర్ అభ్యర్థన
హత్రాస్ కేసు విచారణను యూపీ బయట మరో కోర్టుకు బదలాయించాలని బాధిత కుటుంబం తరఫు లాయర్ సీమా కుశ్వాహా డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా సీమా కుశ్వాహా.. సీబీఐ రిపోర్టులను రహస్యంగా ఉంచాలని, ఈ కేసు విచారణను యూపీ బయట మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కేసు పూర్తిగా ముగిసేవరకు హత్రాస్ కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలన్నారు. యూపీ సర్కార్ తరఫున వాదించిన అదనపు అడ్వొకేట్ […]
హత్రాస్ కేసు విచారణను యూపీ బయట మరో కోర్టుకు బదలాయించాలని బాధిత కుటుంబం తరఫు లాయర్ సీమా కుశ్వాహా డిమాండ్ చేశారు. అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ సోమవారం ఈ కేసును విచారించింది. ఈ సందర్భంగా సీమా కుశ్వాహా.. సీబీఐ రిపోర్టులను రహస్యంగా ఉంచాలని, ఈ కేసు విచారణను యూపీ బయట మరో కోర్టుకు బదిలీ చేయాలని కోరారు. కేసు పూర్తిగా ముగిసేవరకు హత్రాస్ కుటుంబానికి సెక్యూరిటీ కల్పించాలన్నారు. యూపీ సర్కార్ తరఫున వాదించిన అదనపు అడ్వొకేట్ జనరల్ వీకే.షాహి..కోర్టులో తమ వాదన వినిపించామన్నారు. హత్రాస్ కుటుంబ సభ్యులతో బాటు రాష్ట్ర ఉన్నతాధికారుల వాదనను కూడా కోర్టు ఆలకించిందని, తదుపరి విచారణను వచ్ఛే నెల 2 కు వాయిదా వేసిందని తెలిపారు.