ఆ ఫోన్ కొంటే రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం..!

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యాపిల్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

ఆ ఫోన్ కొంటే రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితం..!
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 12, 2020 | 7:56 PM

మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. యాపిల్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. అమెరికన్ మల్టీనేషనల్ టెక్నాలజీ సంస్థ యాపిల్ దీపావళిని పురస్కరించుకుని భారత్‌లో బ్రహ్మాండమైన ఆఫర్ ప్రకటించింది. యాపిల్ ఐఫోన్ 11‌ స్మార్ట్‌ఫోన్‌ను తమ ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలు చేసిన వారికి ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి ఆఫర్ అందుబాటులోకి రానున్నట్లు పేర్కొంది.

భారత్‌లో ఇటీవల ప్రారంభించిన ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసిన వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని యాపిల్ తెలిపింది. యాపిల్ ఐఫోన్ 11 కొనుగోలుపై రూ.14,900 విలువైన ఎయిర్‌పాడ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఈ ఆఫర్ ఒక్క యాపిల్ ఆన్‌లైన్ స్టోర్‌కే పరిమితం కాగా, పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఇతర రిటైలర్లు కూడా భారీ ఆఫర్లు ప్రకటించారు. గ్రేట్ ఇండియన్ సేల్‌లో భాగంగా ఐఫోన్ 11ను అమెజాన్ రూ.49,999కే అందించనుంది. యాపిల్ ఐఫోన్ 11 గతేడాది మార్కెట్లోకి వచ్చింది. యాపిల్ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌లో ప్రస్తుతం ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్ ధర రూ.68,300 కాగా 128జీబీ వేరియంట్ ధర రూ.73,600. ఇక 256జీబీ వేరియంట్ ధర రూ.84,100. ఈ మూడు మోడల్స్‌లో ఏది కొన్నా ఎయిర్‌పాడ్స్ ఉచితంగా అందిస్తామని పేర్కొంది. ఐఫోన్ 12 సిరీస్‌ను ఈ నెల 13న విడుదల చేయనున్నట్టు సమాచారం. ఇందులో ఐఫోన్ 12 మినీ, ఐఫోన్ 12, ఐఫోన్ 12 ప్రొ, ఐఫోన్ 12 ప్రొ మ్యాక్స్ వంటివి కూడా ఉండనున్నాయి.