సరిహద్దుల్లో పెను వివాదం సృష్టించిన చైనా, రాజ్ నాథ్ సింగ్ ఫైర్

భారత సరిహద్దుల్లో చైనా పెను వివాదం సృష్టించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇదేదో తమ ‘మిషన్’ లో భాగంగా ఆ దేశం తలచిందన్నారు. మన దేశ ఉత్తర, తూర్పు బోర్డర్స్ లో ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలతో బాటు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో బ్రిడ్జిలను రాజ్ […]

సరిహద్దుల్లో పెను వివాదం సృష్టించిన చైనా, రాజ్ నాథ్ సింగ్ ఫైర్
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2020 | 8:40 PM

భారత సరిహద్దుల్లో చైనా పెను వివాదం సృష్టించిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. ఇదేదో తమ ‘మిషన్’ లో భాగంగా ఆ దేశం తలచిందన్నారు. మన దేశ ఉత్తర, తూర్పు బోర్డర్స్ లో ఓ వైపు పాకిస్థాన్, మరోవైపు చైనా సమస్యలు సృష్టిస్తున్నాయని ఆయన చెప్పారు. ఇక్కడ ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాలతో బాటు జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంలో బ్రిడ్జిలను రాజ్ నాథ్ సింగ్ సోమవారం ప్రారంభించారు. వీటివల్ల మన సైనిక జవాన్ల రాకపోకలు సులభంగా జరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.