కర్ణాటకలో కొత్తగా 7,606 మందికి కరోనా.. 70 మంది మృతి
కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి.
దేశంలో కరోనా కేసుల తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. అటు మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నాయి. అటు కర్ణాటక రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా వేల సంఖ్యలో కరోనా కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆదివారం నుంచి సోమవారం వరకు గత 24 గంట వ్యవధిలో కొత్తగా 7,606 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 70 మంది కరోనాను జయించలేక ప్రాణాలను కోల్పోయాయి. దీంతో మొత్తం కర్ణాటక వ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 7,17,915కు చేరింది. ఇవాళ్టి మరణాలతో కలిపి మొత్తం మృతుల సంఖ్య 10,036కు పెరిగింది. గత 24 గంటల్లో 12,030 మంది కోలుకుని వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో కర్ణాటకలో ఇప్పటి వరకు వైరస్ బారిన పడిన వారిలో 5,92,084 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,15,776 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వెల్లడించింది.