Gyanvapi case: జ్ఞానవాపి కేసులో విచారణ మే 26కు వాయిదా.. వారం రోజులు గడువు..
Gyanvapi case: జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను మే 26వ తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. కమిషన్ సర్వే నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసేందుకు
Gyanvapi case: జ్ఞానవాపి కేసులో తదుపరి విచారణను మే 26వ తేదీకి వాయిదా వేసింది వారణాసి కోర్టు. కమిషన్ సర్వే నివేదికపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేసేందుకు ఇరుపక్షాలకు 7 రోజులు అమనుతి ఇచ్చింది కోర్టు. సర్వే రిపోర్ట్, మసీదులో శివలింగం అంశంపై సోమవారం నాడు విచారణ జరిపిన ధర్మాసనం.. ఇరుపక్షాల వాదనలు విన్నది. అనంతరం తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు న్యాయమూర్తి ఎక్ విశ్వేష్ ప్రకటించారు. అయితే, మసీదులో ఉన్న శివలింగానికి నిత్య పూజలు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని నలుగురు హిందువులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి ముస్లిం వర్గం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై మే 26వ తేదీన కోర్టులో విచారణ జరుగనుంది. హిందువుల వాదనపై, ముస్లింల అభ్యంతరంపై 26వ తేదీన ఇరు పక్షాల వాదనలు విననుంది కోర్టు. అలాగే జ్ఞానవాపి మసీదులో కమిషన్ చేపట్టిన సర్వే, నివేదికపై ఇరు వర్గాలు తమ అభ్యంతరాలు తెలుపాలని, వారంలోగా నివేదికను సమర్పించాలని కోర్టు కోరింది.