ఓ వ్యక్తి ముచ్చటపడి చేసుకున్న పెళ్లి పెటాకులైంది. ఏకంగా ఆరేళ్లు కాపురం చేశాక తన భార్య అసలు మహిళేకాదని తెలుసుకున్నాడు. దీంతో భార్యపై చీటింగ్ కేసు పెట్టి, న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. వివరాల్లోకెళ్లే.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌కు చెందిన యువకుడికి మురైనాకు చెందిన యువతితో 2016లో పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. ఐతే అప్పటి నుంచి వారి మధ్య ఎటువంటి శారీరక సంబంధం లేదు. భార్య తీరుపై అనుమానం కలిగిన భర్తకు షాకింగ్ విషయం తెలిసింది. వివాహం జరిగిన ఆరేళ్లకు ఈ విషయం విషయం తెలుసుకున్న భర్త తన భార్య మహిళ కాదని, పురుషుడని, తనని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్లు సదరు భార్యతోపాటు, ఆమె తండ్రిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
భార్యపై చీటింగ్ కేసు నమోదు చేయాలని ఏకంగా హైకోర్టులో పిటీషన్ వేశాడు. ఐతే హైకోర్టు ఈ పిటీషన్‌ను తోసిపుచ్చింది. ఐతే పురుషుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు యువతి వాదన మరోలా ఉంది. తనకు హార్మోన్ సమస్య ఉండడం వల్లనే ఇలా ఉన్నానని, అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నట్లు యువతి తెలిపింది. అయినప్పటికీ అనుమానం తీరని భర్త, తన భార్యకు వైద్య పరీక్షలు చేయించాడు. దీంతో అతని వాదన నిజమేనని తేలింది. తన భార్యగా చెప్పబడుతున్న యువతి మహిళకాదని, పురుషుడని వైద్య పరీక్షల్లో తేలింది. ఈ కేసును విచారించిన కోర్టు వివాహాన్ని రద్దు చేసింది.