పొట్టపోసుకోవడానికి సొంతూరు వదిలి వలస వచ్చిన ఆ తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిని వీధికుక్కలు ఈడ్చుకెళ్లి హతమర్చాయి. విగతజీవిగామారిన కొడుకును పట్టుకుని గుండెలవిసేలా విలపించేరా తల్లిదండ్రులు. గుజరాత్‌లో బుధవారం చోటుచేసుకున్న ఈ షాకింగ్ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సూరత్ సమీపంలోని కరేలి గ్రామంలో ఫిబ్రవరి 8 తెల్లవారుజామున ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది. బాలుడి తల్లిదండ్రులు రాజస్థాన్‌కు చెందినవారు. భవన నిర్మాణ కార్మికులుగా పనిచేసుకుంటూ కరేలీ గ్రామంలో ఓ చిన్న గుడిసెలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో బుధవారం నాడు నాలుగేళ్ల చిన్నారిని గుడిసె నుంచి బయటికి వచ్చాడు. అక్కడే ఉన్న నాలుగు వీధికుక్కలు బాలుడిపై దాడి చేశాయి. అనంతరం బాలుడి మెడను నోటితో పట్టి దూరంగా లాక్కువెళ్లాయి. గమనించిన తల్లిదండ్రులు, ఇతర కార్మికులు కుక్కలను తరిమి బాలుడిని రక్షించి 11 కిలోమీటర్ల దూరంలో బర్దోలీలోఉన్న ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడు అప్పటికే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. పోలీసులు యాక్సిడెంటల్ డెత్ కింద కేస్‌గా నమోదు చేసుకున్నట్లు పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ సీఎం గాధవి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.