AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో నాలుగు ఆసుపత్రులు.. దుప్పట్లలో చుట్టి చిన్నారుల తరలింపు!

భావ్‌నగర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని సమాచారం. అనేక ఆసుపత్రులు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడ చేరిన రోగులను వెంటనే రక్షించారు. ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను సురక్షితంగా తరలించారు. ఆసుపత్రిలో చేరిన పిల్లలు, ఇతర రోగులను గాజు పగలగొట్టి రక్షించాల్సి వచ్చింది.

కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో నాలుగు ఆసుపత్రులు.. దుప్పట్లలో చుట్టి చిన్నారుల తరలింపు!
Bhavnagar Hospital Building Fire
Balaraju Goud
|

Updated on: Dec 03, 2025 | 12:33 PM

Share

భావ్‌నగర్ సమీపంలోని ఒక కాంప్లెక్స్‌లో మంటలు చెలరేగాయి. ఆ కాంప్లెక్స్‌లో ప్రస్తుతం నాలుగు ఆసుపత్రులు ఉన్నాయని సమాచారం. అనేక ఆసుపత్రులు మంటల్లో చిక్కుకున్నాయి. సమాచారం అందుకున్న సహాయక బృందాలు అక్కడ చేరిన రోగులను వెంటనే రక్షించారు. ఇప్పటి వరకు 20 మంది చిన్నారులను సురక్షితంగా తరలించారు. ఆసుపత్రిలో చేరిన పిల్లలు, ఇతర రోగులను గాజు పగలగొట్టి రక్షించాల్సి వచ్చింది.

రోగులందరినీ వెంటనే సర్ టి మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. మంటలు ఇప్పుడు అదుపులోకి వచ్చాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఉపశమనం కలిగించే విషయం. ఐదు అగ్నిమాపక దళాలు, 50 మంది సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మంటలు విస్తృతంగా వ్యాపించడంతో ఆర్పడానికి గంటల సమయం పట్టింది.

భవనంలోని మొదటి అంతస్తులో దాదాపు 20 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరినట్లు సమాచారం. అగ్నిమాపక శాఖకు వెంటనే సమాచారం అందింది. అటు స్థానికులు వెంటనే స్పందించి, కిటికీపై నిచ్చెనలు వేసి, పిల్లలను దుప్పట్లలో చుట్టి, ఒక్కొక్కరిగా బయటకు తీసుకు వచ్చారు. వారి అప్రమత్తత, సమయస్పూర్తి పిల్లల ప్రాణాలను కాపాడింది.

భావ్‌నగర్‌లోని సామిప్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. ఇందులో పిల్లల ఆసుపత్రితో సహా అనేక కార్యాలయాలు, ఇతర ఆసుపత్రులు ఉన్నాయి. మంటలు చెలరేగిన వెంటనే, భారీ పొగలు ఎగసిపడ్డాయి. పోలీసులు, అగ్నిమాపక శాఖ బృందాలు అప్రమత్తమై వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. స్థానిక ప్రజలు, అధికారుల చొరవతో లోపల చిక్కుకున్న వారందరినీ సురక్షితంగా తరలించారు.

దాదాపు గంటసేపు శ్రమించిన తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు. ఇంత రద్దీగా ఉండే కాంప్లెక్స్‌లో పిల్లల ఆసుపత్రి ఉండటం, ఒకే భవనంలో బహుళ ఆసుపత్రులు ఉండటంపై స్థానికుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొదట భవనం సెల్లార్‌లో మంటలు చెలరేగాయి. ఈ సెల్లార్‌ను పార్కింగ్ కోసం ఉపయోగించాలి. కానీ దానిని ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఇంకా దర్యాప్తు జరుగుతోంది. ఇంత వినాశకరమైన అగ్నిప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడం ఒక అద్భుతం అని భావిస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..