Watch Video: వామ్మో.. జాతరలో ఒక్కసారిగా కూలిన ఫెయిర్ రైడ్.. భయంతో పరుగులు తీసిన జనాలు.. ఎక్కడో తెలుసా?
గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బిల్లిమోరాలోని సోమనాథ్ మహాదేవ్ ఆలయ జాతరలో20 అడుగుల ఎత్తైన టవర్ రైడ్ అకస్మాత్తుగా కూలిపోయింది, ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడగా. మరో 10 మంది స్పల్పంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు, రైడ్ ఆపరేటర్ ఉన్నారు. అప్రమత్తమైన అధికారులు వెంటనే క్షతగ్రాతులను సూరత్‌లోని హాస్పిటల్‌కు తరలించారు.

శ్రావణ మాసం చివరి సోమవారం ముందు రోజు ఆదివారం రాత్రి 11:45 గంటల ప్రాంతంలో సోమనాథ్ మహాదేవ్ ఆలయ సముదాయంలో సందడిగా ఉండే జాతరలో పది మందికి పైగా ఈ రైడ్‌ను ఆస్వాదిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, రైడ్ దాదాపు 40 అడుగుల ఎత్తుకు చేరుకొని నెమ్మదిగా కిందకు వస్తుండగా 20 అడుగుల ఎత్తు నుండి కూలిపోయింది. ఆ సమయంలో రైడ్‌లో దాదాపు 10 మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. భారీ శబ్దంతో రైడ్ పడిపోవడంతో ఫెయిర్ గ్రౌండ్ అంతటా భయాందోళనలు వ్యాపించాయి. స్థానిక పోలీసులు, బిలిమోరా అగ్నిమాపక సిబ్బంది, చుట్టుపక్కల వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని అంబులెన్స్‌ల సహాయంతో అత్యవసర చికిత్స కోసం మొదట బిలిమోరా ఆసుపత్రికి తరలించారు.
అక్కడ వీరిని పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. తీవ్రంగా గాయపడిన వారిలో 14 ఏళ్ల జాష్ రాజీవ్ టాండెల్, 14 ఏళ్ల దిర్గ్ హేమంత్ టాండెల్, 30 ఏళ్ల రోష్ని వికాస్ పటేల్, 21 ఏళ్ల దిశా రాకేష్ పటేల్ ఉన్నారు, వీరందరికీ నడుముకు గాయాలయ్యాయి. కాగా రైడ్ ఆపరేటర్‌కు తల, వెన్నెముకకు గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మెరుగైన చికిత్స కోసం అతన్ని సూరత్‌లోని హాస్పిటల్‌కు తరలించారు.
ఈ ప్రమాదం జాతరలో ఉన్న ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. రైడ్ కూలిపోతున్న ప్రత్యక్ష దృశ్యాలు జాతరలో ఉన్న కొంతమంది మొబైల్ కెమెరాల్లో చిత్రీకరించారు. వాటిని సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ఇవి కాస్తా ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ సంఘటన రైడ్‌లను నడపడానికి ముందు భద్రతా ప్రోటోకాల్‌లు, రాష్ట్ర SOPలను పాటించారా లేదా అనే దానిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు.
వీడియో చూడండి..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




