Human Sacrifice: ఘోర సంఘటన.. అగ్నిహోమంలో తలలు నరుక్కుని దంపతుల నరబలి..

|

Apr 18, 2023 | 8:17 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో తాంత్రిక పూజలు చేసి.. ఓ జంట ప్రాణాలు బలిచ్చారు. భార్యభర్త లిరువురు తమకు తామే తలలు నరుక్కుని నరబలి అర్పించుకున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన..

Human Sacrifice: ఘోర సంఘటన.. అగ్నిహోమంలో తలలు నరుక్కుని దంపతుల నరబలి..
Human Sacrifice
Follow us on

గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. మూఢనమ్మకాల ముసుగులో తాంత్రిక పూజలు చేసి.. ఓ జంట ప్రాణాలు బలిచ్చారు. భార్యభర్త లిరువురు తమకు తామే తలలు నరుక్కుని నరబలి అర్పించుకున్నారు. ఆదివారం చోటుచేసుకున్న ఈ షాకింగ్‌ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

జిల్లాలోని వింఛియా గ్రామంలో కాపురం ఉంటున్న హేముభాయ్ మక్వానా (38), అతని భార్య హన్సాబెన్ (35) దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. వీరు తరచూ తాంత్రిక పూజలు చేసేవారు. ఈ క్రమంలో బలి అర్పనకు తమ పొలంలో ఓ గుడిసెను నిర్మించుకున్నారు. అందులో అగ్ని హోమాన్ని ఏర్పాటు చేసి.. తలలు అందులో పడే విధంగా గిలెటిన్ లాంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పథకాన్ని అమలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా తలలు, శరీరాలు వేరుపడి రక్తసిక్తంగా ఉన్న ఆ ప్రదేశాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. సంఘటన స్థలంలో సూసైడ్‌ నోట్‌ లభ్యమైనట్లు వించియా పోలీస్ స్టేషన్‌ చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్ ఇంద్రజీత్‌సిన్హ్ జడేజా తెలిపారు.

దంపతులు మొదట తమ తలలను తాడుతో పట్టుకుని యంత్రం కింద పెట్టారు. వారు తాడును విడిచిపెట్టిన వెంటనే ఇనుప బ్లేడ్ వారిపై నేరుగా పడి తలలు తెగాయి. అనంతరం అవి నేరుగా మంటల్లోకి దూసుకెళ్లినట్లు ఆత్మహత్య జరిగిన విధానాన్ని జడేజా మీడియాకు వివరించారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు దంపతులు కర్మ నిర్వహించిటన్లు పోలీసుల విచారణలో బయటపడింది. గత ఏడాది కాలంగా వీరిద్దరూ ప్రతిరోజూ గుడిసెలో  పూజలు చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుల పిల్లలు, తల్లిదండ్రులు, ఇతర బంధువులు గుడిసెకు సమీపంలో నివసించేవారు. ఆదివారం ఉదయం సంఘటన గురించి తెలుసుకున్న వారు పోలీసులకు సమాచారం అందించినట్లు ఓ పోలీసధికారి తెలిపారు. సూసైడ్‌ నోట్‌లో పిల్లలు, తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చేసుకోవాలని బంధువులను కోరినట్లు ఆయన తెలిపారు. అనతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.