గోవుల అక్రమ రవాణా కేసు విచారణలో గుజరాత్ కోర్టు ఆదివారం సంచలన తీర్పు వెలవరించింది చేసింది. గోహత్యను అడ్డుకుంటే భూమిపై ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయని పేర్కొంది. నవంబర్ 2022లో మహారాష్ట్ర నుంచి అక్రమంగా పశువులను రవాణా చేసిన కేసును విచారించిన కోర్టు నిందితులకు జీవిత ఖైదుతోపాటు రూ.5 లక్షల జరిమానా విధించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సమీర్ వినోద్‌చంద్ర వ్యాస్ మాట్లాడుతూ..’గోవు రక్తం భూమిపై పడని రోజు భూమిపై ఉన్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. ఆవు కేవలం జంతువు మాత్రమే కాదు.. తల్లిలాంటిది. ఆవుకి ఉన్నంత కృతజ్ఞత మరే జంతువుకు లేదు. ఆవును మతపరమైన అంశంగా మాత్రమే కాకుండా దాని సామాజిక, ఆర్థిక, శాస్త్రీయ ప్రయోజనాలను కూడా పరిగణించాలని జడ్జి పిలుపునిచ్చారు.
ఆవులను అమానవీయ రీతిలో రవాణా చేస్తున్న పశువుల స్మగ్లింగ్ కేసులో మహ్మద్ అమీన్‌ను 2020లో ఆగస్టు 27న పోలీసులు అరెస్టు చేశారు. పశువులు కూర్చోవడానికి, తినడానికి, త్రాగడానికి సరైన సదుపాయాలేవీలేకుండా ప్యాక్ చేసిన ట్రక్కులో16 ఆవులను అమానవీయంగా రవాణా చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. గుజరాత్‌లో గోసంరక్షణ సంబంధిత చట్టాలు ఆచరణకు నోచుకోకపోవడంతో జడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.