మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలో సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వరుడు.. కట్ చేస్తే!

|

Nov 04, 2022 | 5:36 PM

మరికొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే..

మరికొద్ది గంటల్లో పెళ్లి.. ఇంతలో సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లిన వరుడు.. కట్ చేస్తే!
Groom Missing
Follow us on

వారిద్దరూ ఒకరికొకరు నచ్చారు. ఇరు కుటుంబాలు పెళ్లికి అంగీకరించారు. వివాహ ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. ఇక మరికొద్ది గంటల్లో పెళ్లి ఉందనగా వరుడు తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. సీన్ కట్ చేస్తే.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే.. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. దానికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రేవరి జిల్లాకు చెందిన రాహుల్ అనే వ్యక్తికి కొద్దిరోజుల క్రిందట ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇక ముహూర్తం డేట్ రానే వచ్చింది. మరికొద్ది గంటల్లో పెళ్లి అనగా.. వరుడు తన సోదరితో కలిసి బ్యూటీ పార్లర్‌కు వెళ్లాడు. సోదరిని అక్కడ దింపేసి.. తాను స్నేహితుడి ఇంటికి వెళ్లి వస్తానని చెప్పాడు. సమయం గడిచింది.. కాని అతడు మాత్రం తిరిగి రాలేదు. దీంతో ఆమె ఇంటికి చేరుకొని కుటుంబసభ్యులకు అసలు విషయాన్ని తెలియజేసింది. వారంతా కూడా స్థానికంగా ఉన్న అన్ని చోట్లా అతడి కోసం గాలించారు. ఎక్కడా ప్రయోజనం లేకపోవడంతో.. చివరికి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రాహుల్ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అతడి మొబైల్ స్విచ్ ఆఫ్ కావడంతో.. రాహుల్ స్నేహితులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇలా పెళ్లికి ముందు వరుడు కనిపించకుండా పోవడంతో అతిధులంతా దెబ్బకు షాకయ్యారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..