కేంద్ర ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. కార్ల‌లో ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌నిస‌రి.. ఎప్ప‌టి నుంచి అంటే..

కేంద్ర ర‌వాణాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కార్ల‌లో ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ర‌వాణా శాఖ మంగ‌ళ‌వారం ఓ ముసాయిదా...

కేంద్ర ర‌వాణా శాఖ కీల‌క నిర్ణ‌యం.. కార్ల‌లో ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌నిస‌రి.. ఎప్ప‌టి నుంచి అంటే..
Follow us

|

Updated on: Dec 29, 2020 | 7:44 PM

కేంద్ర ర‌వాణాశాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కార్ల‌లో ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌ని స‌రి చేస్తూ నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు కేంద్ర ర‌వాణా శాఖ మంగ‌ళ‌వారం ఓ ముసాయిదా నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేసింది. కార్లు త‌దిత‌ర ప్యాసింజ‌ర్ వాహ‌నాల ముందు సీట్లో కూడా ఎయిర్ బ్యాగులు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌న్న నిబంధ‌న త్వ‌ర‌లో భార‌త్ లో అమ‌లులోకి రానుంది. ఇప్ప‌టి నుంచే డ్రైవ‌ర్ సీటు వ‌ద్ద మాత్ర‌మే ఎయిర్ బ్యాగు త‌ప్ప‌నిస‌రిగా కాగా, ఇక‌పై ముందు వ‌రుస‌లో డ్రైవ‌ర్ ప‌క్క‌న ఉండే సీటు వ‌ద్ద కూడా ఎయిర్ బ్యాగు ఉండాల్సిందే..

కాగా, ఈ రోజు ముసాయిదా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన కేంద్ర ర‌వాణా శాఖ‌.. దీని ప్ర‌కారం కారు ముందు వైపు ఉండే ప్యాసింజ‌ర్ సీటులో కూడా ఎయిర్ బ్యాగు ఉండాల‌నే నిబంధ‌న‌కు అనుగుణంగా వాహ‌న‌దారులు మార్పులు చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను కొత్త మోడ‌ల్ కార్ల‌కు 2021, ఏప్రిల్ 1 వ‌ర‌కు, ఇప్ప‌టికే వాడుతున్న కార్ల‌కు 2021, జూన్ 1 గ‌డువు తేదీగా నిర్ణ‌యించింది. ఎయిర్ బ్యాగుల ప్ర‌మాణాల గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండ‌ర్డ్స్ (బీఐఎస్‌) ఆదేశాలు వెలువ‌డేంత వ‌ర‌కు అవి ఏఐఎస్ 145 నిబంధ‌న‌కు అనుగుణంగా ఉండాల‌ని ఈ నోటిఫికేష‌న్‌లో సూచించారు. అంతేకాకుండా భ‌విష్య‌త్తులో త‌యారు చేసే వాహ‌నాల్లో ప్ర‌యాణికుల సీట్ల‌లో కూడా ఎయిర్ బ్యాగుల‌ను అమ‌ర్చేలా ఆటోమెటిక్‌ఖ ఇండ‌స్ట్రీ స్టాండ‌ర్డ్స్ (ఏఐఎస్‌) నిబంధ‌న‌ల‌లో మార్పు చేయ‌నున్నారు.

Govt of India issues draft rules to make front air bag mandatory 1

కాగా, 2019, జులై 1 నుంచి అన్ని కార్ల‌లో డ్రైవ‌ర్ సీటులో ఎయిర్ బాగు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల‌నే నిబంధన‌లున్న విష‌యం తెలిసిందే. అయితే డ్రైవ‌ర్ సీటు ప‌క్క‌న కూర్చొనే ప్ర‌యాణికుల‌కు కూడా అంతే ప్ర‌మాదం పొంచివుండే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో కేంద్రం తాజాగా ఈ మార్పులు చేసేందుకు నిర్ణ‌యించింది. ఈ ముసాయిదా నోటిఫికేష‌న్ చెల్లుబాటు వ్య‌వ‌ధి 30 రోజుల్లో పూర్త‌వుతుంద‌ని, ఈ విష‌యమై ఎవ‌రికైనా ఏవైనా అభ్యంత‌రాలుంటే ర‌వాణా శాఖ జాయింట్ సెక్రట‌రీ దృష్టికి తీసుకురావాల‌ని అధికారులు వెల్ల‌డించారు.