AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal: ఆస్పత్రిలో బిర్యానీ బిల్లు కోసం రూ.3 లక్షల .. అవాక్కైన అధికారులు!

సౌవిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. అందులో ఉన్న బిల్లును చూసి షాకయ్యారు.

West Bengal: ఆస్పత్రిలో బిర్యానీ బిల్లు కోసం రూ.3 లక్షల .. అవాక్కైన అధికారులు!
Three Lakhs Bill For Biryan
Surya Kala
|

Updated on: May 15, 2022 | 9:24 PM

Share

West Bengal: ఏ రెస్టారెంట్‌లోనైనా బిర్యాని ధర ఎంత ఉంటుంది..? మహా అయితే మూడు వందల వరకూ ఉంటుంది. కానీ ఓ వ్యక్తికి కేవలం బిర్యానీకి రూ.3 లక్షలు అయిందట. బిర్యానీ కోసం లక్షల్లో బిల్లు పెట్టడంతో అధికారులు సైతం అవాక్కయ్యారు. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లోని కత్వా(Katwa) సబ్ డివిజనల్ ఆస్పత్రిలో జరిగింది. సౌవిక్ ఆలం అనే వ్యక్తి ఇటీవలే ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆయన పెండింగ్‌లో ఉన్న బిల్లులను క్లియర్ చేయాలనుకున్నారు. అందులో ఉన్న బిల్లును చూసి షాకయ్యారు.

ఓ కాంట్రాక్టర్ బిర్యానీ కోసం దాదాపు రూ.3 లక్షలు వెచ్చించినట్టు బిల్లు దాఖలు చేశాడు. ఈ బిల్లు కలకలం రేపింది. కింగ్‌షుక్ అనే కాంట్రాక్టర్ హాస్పటల్‌కి వివిధ రకాలైన వస్తువులను సరఫరా చేసేవాడు. ఇందులో భాగంగా ఫర్నీచర్, ఫార్మసీ, వాహనం ఖర్చుతో పాటు అనేక ఇతర బిల్లులను కలపి సుమారు రూ.3 కోట్లు పెట్టాడు. దీంతో అనుమానం వచ్చిన అధికారులు ఎంక్వేరీ మొదలుపెట్టారు. అసలు బిల్లులను లెక్క తేల్చే పనిలో పడ్డారు సౌవిక్ ఆలం. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 81 రకాల దొంగ బిల్లులు బయటపడ్డాయి. దీంతో పెద్దఎత్తున అవినీతి జరిగినట్టు గుర్తించారు. ఆ బిల్లులను చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ అవినీతిపై చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.

పేషెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పెషల్ వెరిఫికేషన్ కమిటీ సమావేశంలో ఈ బోగస్ బిల్లులను డిపాజిట్ చేసిన నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైద్య ఆరోగ్య శాఖ కూడా నకిలీ బిల్లుల విషయాన్ని ధ్రువీకరించింది. ఆ బిల్లును ఆమోదించిన ప్రతి ఒక్కరిని విచారిస్తామని, దోషులగా తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు చెప్పారు. తప్పుదారి పట్టించే క్లెయిమ్‌లకు బాధ్యులైన వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు వచ్చాయి. మేము వీలైనంత త్వరగా విచారణను పూర్తి చేస్తాం.” అని డిప్యూటీ సీఎంఓహెచ్-2 డాక్టర్ సుబర్నో గోస్వామి అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..