Governor Acharya Devvrat: జాతిపిత మహాత్మా గాంధీ కలలను సాకారం చేస్తున్న గుజరాత్ విద్యాపీఠ్ క్యాంపస్‌ను గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వయంగా చీపురు పట్టి శుభ్రం చేశారు. కొన్ని రోజుల క్రితం గుజరాత్ విద్యాపీఠాన్ని పరిశీలించిన గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అధికారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా క్యాంపస్ నెలకొన్న అపరిశుభ్రత, చెత్తా, చెదారం చూసి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ అసంతృప్తికి గురయ్యారు. అనంతరం దేవవ్రత్.. స్వయంగా పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. శుక్రవారం గుజరాత్ విద్యాపీఠంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికులతో కలిసి గవర్నర్ ఆచార్య దేవవ్రత్ స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యాపీఠ్ క్యాంపస్‌లో కార్మికులతో కలిసి శుభ్రం చేశారు. గవర్నర్ స్వయంగా చీపురు, గడ్డపార పట్టుకుని.. స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొనడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.
కాగా.. గవర్నర్ ఆచార్య దేవవ్రత్ గుజరాత్ విద్యాపీఠానికి ఛాన్సలర్ గా ఉన్నారు. క్యాంపస్ పరిస్థితిని చూసిన గవర్నర్ ఆచార్య దేవవ్రత్ శుక్రవారం స్వచ్ఛత డ్రైవ్ ను ప్రారంభించారు. మున్సిపల్ కార్పొరేషన్‌లోని సుమారు 30 మంది పారిశుధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛతా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గుజరాత్ విద్యాపీఠం వైస్ ఛాన్సలర్ రాజేంద్ర ఖిమానీ, రిజిస్ట్రార్ నిఖిల్ భట్ కు గవర్నర్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. విద్యాపీఠం క్యాంపస్‌లో పరిశుభ్రత పాటించాలని కోరారు. గత 15 రోజులుగా విద్యాపీఠం క్యాంపస్‌లో స్వచ్ఛత కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
క్యాంపస్, హాస్టళ్లు, మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లలో విద్యార్థుల గుట్కా ప్యాకెట్లు కనిపించడం, అపరిశుభ్రంగా ఉండటంపై కూడా గవర్నర్ విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులు పొగాకు తినొద్దంటూ సూచించారు. పొగాకు కారణంగా యూనివర్సిటీ క్యాంపస్ అపరిశుభ్రంగా మారిందని తెలిపారు. గుజరాత్ విద్యాపీఠంలో జాతిపిత మహాత్మాగాంధీ ఆలోచనలు సజీవంగా ఉన్నాయని, అలాంటి సంస్థను దత్తత తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో అహ్మదాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎం.తెనర్సన్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఐకె పటేల్, సిఆర్ ఖర్సన్, అధికారులు పాల్గొన్నారు.
आज गुजरात विद्यापीठ में लगातार दूसरे दिन भी सफाई अभियान चलाया। अहमदाबाद महानगरपालिका के सहयोग से दो दिन में यहां से बीस ट्रक से भी ज्यादा कचरा निकाला गया। कल जिस स्थान पर सफाई की थी वहां फूलों के पौधों का आरोपण भी किया। यहां खेलकूद के मैदान को जल्द खेलने योग्य बनाए जाएंगे। pic.twitter.com/WXprDxcxja
— Acharya Devvrat (@ADevvrat) December 17, 2022
గుజరాత్ విద్యాపీఠం.. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని డీమ్డ్ విశ్వవిద్యాలయం. దీనిని 1920లో జాతిపిత మహాత్మా గాంధీ స్థాపించారు. 1963లో గుజరాత్ విద్యాపీఠంను ప్రభుత్వం విశ్వవిద్యాలయంగా మార్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..