Rajasthan: మేనత్తను నరికి చంపిన అల్లుడు.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ఊరవతల పడేశాడు..

సమాజంలో నేరాలు, హత్యలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా వీర విహారం చేస్తున్నాయి. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఘటనను మరవకముందే.. రాజస్థాన్ లో ఇలాంటి...

Rajasthan: మేనత్తను నరికి చంపిన అల్లుడు.. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ఊరవతల పడేశాడు..
Murder
Follow us
Ganesh Mudavath

|

Updated on: Dec 18, 2022 | 1:18 PM

సమాజంలో నేరాలు, హత్యలు యథేచ్ఛగా పెరిగిపోతున్నాయి. అడ్డూ అదుపూ లేకుండా విచ్చలవిడిగా వీర విహారం చేస్తున్నాయి. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ దారుణ హత్య ఘటనను మరవకముందే.. రాజస్థాన్ లో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. బయటకు వెళ్లొద్దన్న ఒకే ఒక్క కారణంతో మేనత్తను దారుణంగా చంపేశాడు మేనల్లుడు. అంతటితో ఆగకుండా ఆమె డెడ్ బాడీని ముక్కలుగా చేసి బ్యాగులో వేసుకున్నాడు. వాటిని జనావాసం లేని ప్రదేశంలో పడేశాడు. అనంతరం తన మేనత్త కనిపించట్లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంధువులు, పోలీసులతో కలిసి అత్త కోసం వెతుకుతున్నట్లు నటించాడు. అయితే, యువకుడు చెప్పే మాటలకు, అతని ప్రవర్తనకు పొంతనలేకపోవడంతో పోలీసులు లోతుగా విచారించారు. దీంతో హత్య విషయం బయటపడింది. రాజస్థాన్ రాజధాని జైపూర్ సిటీలోని విద్యానగర్ ప్రాంతంలో అనూజ్ శర్మ.. తన మేనత్తతో కలిసి నివాసముంటున్నాడు. అతని మేనమామ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో మేనత్త తన అల్లుడు, అన్న, మేన కోడలితో కలిసి నివాసముంటోంది.

ఈ క్రమంలో ఓ రోజు ఇంట్లో వాళ్లందరూ బయటకు వెళ్లారు. అత్త, మేనల్లుడు సరోజ్, తన మేనల్లుడు అనూజ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. ఇదే సమయంలో ఢిల్లీలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో తాను పాల్గొంటానని, అందుకు ఢిల్లీ వెళ్తానని అనూజ్ మేనత్తను కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో ఇద్దరి మధ్యా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర కోపోద్రిక్తుడైన అనూజ్‌ మేనత్తను సుత్తితో తలపై బలంగా కొట్టాడు. దాంతో ఆమె అక్కడిక్కడే మృతిచెందింది.

ఈ ఘటనతో కంగారు పడిన అనూజ్‌ మేనత్త మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఓ సూట్‌కేసులో, ఇంకో బకెట్‌లో పెట్టుకొని ఊరవతల పడేసి వచ్చాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రంగంలోకి దిగిన పోలీసులు సరోజ్‌ ఇంటి బయట ఉన్న సీసీ పుటేజ్‌లను పరిశీలించారు. అందులో అనూజ్‌ సూట్‌కేసు, బకెట్‌తో వెళ్లడం చూసిన పోలీసులు అనుమానంతో అనూజ్‌ను తమదైనశైలిలో ప్రశ్నించారు. దాంతో ఢిల్లీకి వెళ్లొద్దన్నందుకు అత్తను చంపేసినట్లు అనూజ్ ఒప్పుకున్నాడు. అనూజ్ పై కేసు నమోదు చేసి, దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..