PM MODI: చైనాతో ఉద్రిక్తతల మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన.. వేలాది కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి..
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో భాగంగా మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తొలుత మేఘాలయలోని షిల్లాంగ్‌లో జరిగిన ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రెండు రాష్ట్రాల్లో కలిపి దాదాపు రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. మేఘాలయాలో ప్రధాని మోదీ , కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఘనస్వాగతం లభించింది. షిల్లాంగ్‌లో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ను ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈశాన్య మండలి స్వర్ణోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ.. ఈ ప్రాంత అభివృద్ధిపై కేంద్రప్రభుత్వం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందన్నారు. దేశంలో అన్ని ప్రాంతాల వలె ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు.
ఈ కార్యక్రమంలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. ప్రధాని మోదీ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయన్నారు. ఈశాన్య ప్రాంతంలో ప్రస్తుతం శాంతి నెలకొని ఉందని తెలిపారు. గతంలో ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్) యాక్ట్ ను రద్దు చేయాలని చాలా డిమాండ్లు వచ్చాయని, . ఇప్పుడు ఎవరూ డిమాండ్ చేయనవసరం లేకుండా ప్రభుత్వమే అడుగు ముందుకేసి ఆర్మడ్ ఫోర్సెస్ (స్పెషల్ పవర్) యాక్ట్ రద్దుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అమిత్ షా వెల్లడించారు. గతంలో ఈశాన్య ప్రాంతం షట్‌డౌన్‌లు, సమ్మెలు, బాంబు పేలుళ్లు, కాల్పులకు ప్రసిద్ధి చెందిందని, స్థానికంగా పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి జరగలేదన్నారు. గత ఎనిమిది సంవత్సరాల కాలంలో ఈశాన్య ప్రాంతం ఎంతో పురోగతి సాధిస్తోందని, అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
#WATCH | PM says, “…When football fever is gripping us all, why not talk in football terminology? When someone goes against the sportsman spirit, they’re shown a red card & sent out. Similarly, in last 8 yrs, we’ve shown red card to several hurdles in development of northeast.” pic.twitter.com/jF5x17QTv1
— ANI (@ANI) December 18, 2022
Meghalaya | Prime Minister Narendra Modi inaugurates various development projects during the golden jubilee celebrations of the North Eastern Council, in Shillong. pic.twitter.com/716Aa5qtbs
— ANI (@ANI) December 18, 2022
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..