Javelin: స్కూలు వార్షికోత్సవాల్లో అపశ్రుతి.. విద్యార్థి మెడలో దూసుకెళ్లిన జావెలిన్..
పాఠశాలలో ఆటలు ఆడే సమయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే వేగంగా పరిగెత్తడం వల్ల గాయాలు అవుతుంటాయి. కాబట్టి టీచర్లు వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు. కామన్ గా స్కూల్ లో జాతీయ పండుగలు...
పాఠశాలలో ఆటలు ఆడే సమయంలో చాలా అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే వేగంగా పరిగెత్తడం వల్ల గాయాలు అవుతుంటాయి. కాబట్టి టీచర్లు వారిని పర్యవేక్షిస్తూ ఉంటారు. కామన్ గా స్కూల్ లో జాతీయ పండుగలు సమయంలో ఆటల పోటీలు నిర్వహిస్తుంటారు. పోటీలనకు ముందు కొన్ని రోజుల ముందే ప్రాక్టీస్ చేయిస్తుంటారు. ఈ సమయాల్లోనూ అప్పుడప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి. ప్రస్తుతం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్లో వార్షికోత్సవాల సందర్భంగా విద్యార్ధులు రకరకాల క్రీడలకు సంబంధించి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జావెలిన్ విద్యార్ధి మెడలోంచి దూసుకుపోయింది. ఈ ఘటన ఒడిశాలోని బలంగీర్ జిల్లాలో ని ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకుంది. ఓ వైపు స్కూల్లో స్పోర్ట్స్ మీట్ జరుగుతోంది. మరోవైపు విద్యార్ధులు క్రీడలకు సంబంధించి వార్షికోత్సవాల సందర్భంగా క్రీడలు ప్రాక్టీస్ చేస్తున్నారు.
హైస్కూల్లో ఓ విద్యార్ధి జావెలిన్ త్రో ప్రాక్టీస్ చేస్తుండగా ప్రమాదవశాత్తు అది తొమ్మిదో తరగతి చదువుతున్న సదానంద మెహర్ అనే విద్యార్ధి మెడలోంచి దూసుకెళ్లింది. మెహర్ మెడ కుడివైపు నుంచి దూసుకెళ్లిన జావెలిన్ ఎడమ వైపు వచ్చేసింది. దాంతో బాలుడిని వెంటనే బలంగీర్‌లోని భీమా భోయ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు విద్యార్ధి మెనుంచి జావెలిన్‌ను జాగ్రత్తగా తొలగించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. బాలుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని బలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా తెలిపారు. బాధిత కుటుంబానికి 30 వేల రూపాయలు తక్షణం సాయం ప్రకటించారు.
ఈ మేరకు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ స్పందించారు. బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. అందుకు అవసరమైన నిధులు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఉపయోగించాలని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.