AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘గూగుల్‌ పే’ను ఆర్బీఐ నిషేధించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ

ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ గూగుల్‌ పేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధించిందని ఇటీవల కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే.

'గూగుల్‌ పే'ను ఆర్బీఐ నిషేధించలేదు.. క్లారిటీ ఇచ్చిన ఎన్‌పీసీఐ
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 27, 2020 | 3:40 PM

Share

ప్రముఖ ఆన్‌లైన్‌ చెల్లింపుల యాప్‌ గూగుల్‌ పేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నిషేధించిందని ఇటీవల కొన్ని పుకార్లు చక్కర్లు కొట్టిన విషయం తెలిసిందే. దీనిపై రిటైల్ చెల్లింపుల సాధికార సంస్థ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) తాజాగా క్లారిటీ ఇచ్చింది. గూగుల్‌ పేను ఆర్బీఐ నిషేధించలేదని స్పష్టం చేసింది. ”గూగుల్‌ పే చట్టబద్ధమైనది. దీని ద్వారా జరిగే లావాదేవీలు సురక్షితమైనవేనని ఆర్బీఐ నిర్ధారించింది” అని ఎన్‌పీసీఐ తెలిపింది.

అయితే గూగుల్‌ పేను ఆర్బీఐ ధ్రువీకరించలేదంటూ అభిజిత్‌ మిశ్రా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టులో ఇటీవల పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ యాప్‌ పేమెంట్స్‌ అండ్‌ సెటిల్‌మెంట్స్‌ చట్టాన్ని ఉల్లంఘించిందని, నగదు బదిలీలు చేసేందుకు ఈ యాప్‌కు ఆర్బీఐ నుంచి సరైన ధ్రువీకరణ లేదని మిశ్రా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై ఆర్బీఐ స్పందిస్తూ.. గూగుల్ పే ఏ విధమైన పేమెంట్ సిస్టమ్‌ని నిర్వహించడం లేదని, అందుకే సంస్థ పేరు అధికారిక ఆపరేటర్ల జాబితాలో లేదని తెలిపింది. అయితే వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో యూపీఐ ద్వారా చెల్లింపులు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించేందుకు గూగుల్‌ పేకు చట్టపరమైన అన్ని అనుమతులు ఉన్నాయని ఆర్బీఐ న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ఇక ఈ వివరణను సరిగా అర్థం చేసుకోని కొందరు గూగుల్‌ పేను ఆర్బీఐ నిషేధించిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు.

Follow Us
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
పూజగదిలో ఈ 8 వస్తువులు ఉన్నాయా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పక..
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
RCB vs GT: ఒక్క బంతి పడకుండానే విజేతగా ఆర్సీబీ..?
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
ప్రాణాలకు తెగించి ఫ్రెండ్స్‌ను కాపాడాడు.. బయటకు వద్దామనుకునే లోపే
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
నేటితో ముగిసిన వేసవి సెలవులు.. రేపట్నుంచి తరగతులు ప్రారంభం
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
భక్తులకు అలర్ట్! కేదార్‌నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత,..
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఎంత మంచివారైనా వీరికి సహాయం చేయొద్దు.. చాణక్యుడి కీలక హెచ్చరిక!
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
ఏసీ నుంచి నీరు లీక్‌ అవుతోందా? చిన్నపాటి ట్రిక్స్‌తో సమస్యకు చెక్
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
తెలియక ఈ మొక్కలను బహుమతిగా ఇస్తున్నారా? వాస్తు ప్రకారం అదృష్టం..
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
ఫ్రెంచ్ ఫ్రైస్‌కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.
కుర్రాళ్లు తెగ పాడుకున్న పాట.. అనితా ఓ అనితా సింగర్ గుర్తున్నాడా.