Monsoon: చల్లని కబురందింది.. రుతుపవనాలు వచ్చేశాయ్‌… పలు ప్రాంతాల్లో వర్షాలు..

|

Jun 08, 2023 | 1:48 PM

గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం..

Monsoon: చల్లని కబురందింది.. రుతుపవనాలు వచ్చేశాయ్‌... పలు ప్రాంతాల్లో వర్షాలు..
Weather Report
Follow us on

Monsoon: ఎండవేడిమితో అల్లాడిపోయిన ప్రజలకు చల్లటి కబురు అందింది. ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు భారత్‌లోకి ప్రవేవించాయి. అనుకూల పరిస్థితుల నేపథ్యంలో నైరుతి రుతుపవనాలు జూన్ 9న కేరళను తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రుతుపవనాల రాకలో వారానికిపైగా జాప్యం జరిగింది. గతేడాది జూన్‌ 1నే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకగా.. ఈ ఏడాది ఆ తేదీ నాటికి కనీసం శ్రీలంకను కూడా దాటలేదు. వాతావరణ మార్పుల కారణంగా ఈ సారి రుతుపవనాల రాక ఆలస్యమైనట్టుగా వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం లక్షద్వీప్‌, కేరళ ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

రుతుపవనాల రాక ప్రభావంతో కేరళలో గత 24 గంటల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళలోని మిగతా ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు మీదుగా కదిలేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. గంటకు 19 నాట్ల వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్లు ఐఎండీ తెలిపింది. అయితే తొలి వారంలో మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

నైరుతి రుతుపవనాల ఆగమనంతో ఇటు, తెలంగాణలోనూ అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే బుధవారం నాడు పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి.