మహిళలకు శుభవార్త.. అమల్లోకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. అందరూ అర్హులే..

|

May 30, 2023 | 6:03 PM

ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి వర్గీకర లేదని స్పష్టం చేశారు. కాబట్టి మహిళలందరూ ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులుగా వెల్లడించారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి అయ్యే ఖర్చులపై ముఖ్యమంత్రికి నివేదిక అందజేయనున్నట్టుగా తెలిపారు.

మహిళలకు శుభవార్త.. అమల్లోకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం.. అందరూ అర్హులే..
Free Bus Rides For Women
Follow us on

మహిళలకు శుభవార్త..జూన్ 1 నుంచి మహిళా ప్రయాణికులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పటి నుంచో ఈ ప్రకటన కోసం ఎదురుచూస్తున్న రాష్ట్రంలోని మహిళలకు ఈ ప్రకటన పెద్ద ఊరటనిచ్చింది. రాష్ట్రంలోని ప్రభుత్వ బస్సుల్లో మహిళలందరూ ఉచితంగా ప్రయాణించవచ్చని కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి మంగళవారం ప్రకటించారు. కర్ణాటక రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్‌టీసీ)లోని నాలుగు డివిజన్ల మేనేజింగ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాన్ని ప్రకటించారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఎలాంటి వర్గీకర లేదని స్పష్టం చేశారు. కాబట్టి మహిళలందరూ ప్రభుత్వ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అర్హులుగా వెల్లడించారు. ఈ పథకం అమలుతో ప్రభుత్వానికి అయ్యే ఖర్చులపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు నివేదిక అందజేయనున్నట్టుగా తెలిపారు.

తాము అధికారంలోకి వస్తే అన్ని ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఎన్నికల వాగ్దానాలకు అనుగుణంగా కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీస్థానిక బస్సులో కూడా ప్రయాణించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకం అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

“BMTC రోజువారీ ప్రయాణీకుల సంఖ్య 35 లక్షలు. రోజువారీ ప్రయాణీకుల్లో దాదాపు 40 శాతం మంది మహిళలు ఉన్నారని, బిఎమ్‌టిసి బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి ప్రతి సంవత్సరం ప్రభుత్వానికి సుమారు రూ. 1,000 కోట్లు ఖర్చవుతుందని స్థూలంగా అంచనా వేశారు అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..