PM Modi: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రధాని మోదీ.. 1000 ప్రాంతాల్లో మోడరన్ రెస్ట్ హౌసెస్..
కొత్త సౌకర్యాలు ట్రక్కు, టాక్సీ డ్రైవర్లకు జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం రెండింటికి ప్రోత్సాహాన్ని ఇస్తాయని, తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రమాదాలను నివారించడంలో కూడా సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందంటూ.. వారి కష్టాల గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. ట్రక్కు, టాక్సీ డ్రైవర్లకు జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని.. దాని కోసం కొత్త పథకాన్ని తీసుకోస్తున్నట్లు వెల్లడించారు. అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్లకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్, విశ్రాంతి సౌకర్యాలతో కూడిన ఆధునిక భవనాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కొత్త పథకం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం తెలిపారు. మొదటి దశలో ఇటువంటి 1,000 ప్రాంతాల్లో మోడరన్ రెస్ట్ హౌసెస్, ఆధునిక సౌకర్యాలను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధాన మంత్రి భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో చెప్పారు.
కొత్త సౌకర్యాలు ట్రక్కు, టాక్సీ డ్రైవర్లకు జీవన సౌలభ్యం, ప్రయాణ సౌలభ్యం రెండింటికి ప్రోత్సాహాన్ని ఇస్తాయని, తద్వారా వారి ఆరోగ్యం మెరుగుపడుతుందని, ప్రమాదాలను నివారించడంలో కూడా సహాయపడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుందంటూ.. వారి కష్టాల గురించి ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. రాష్ట్ర సరిహద్దుల్లోని చెక్‌పోస్టులను రద్దు చేయడంతోపాటు వాణిజ్యాన్ని వేగవంతం చేయడంలో వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) రూపాంతర ప్రభావాన్ని కూడా మోదీ ఎత్తిచూపారు. ఫాస్ట్‌ట్యాగ్ టెక్నాలజీ పరిశ్రమలో ఇంధనం, సమయాన్ని ఆదా చేస్తుందని తెలిపారు.
ఇటీవలి అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. ఫాస్ట్‌ట్యాగ్ టెక్నాలజీ ఆర్థిక వ్యవస్థకు రూ. 40,000 కోట్ల వార్షిక ప్రయోజనానికి దోహదం చేస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
2047 నాటికి ‘అభివృద్ధి చెందిన భారతదేశం’ లక్ష్యాన్ని చేరుకోవడంలో మొబిలిటీ రంగం భారీ పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు ప్రపంచ ఆర్థిక శక్తి కేంద్రంగా అవతరిస్తుందని.. దీనిలో ఆటో, ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ గణనీయమైన పాత్ర పోషిస్తోందని చెప్పారు.
గ్లోబల్ ఆటోమోటివ్ మార్కెట్‌లో భారతదేశం ఔన్నత్యాన్ని ఎత్తిచూపిన మోడీ.. ఈ రోజు, భారతదేశం ప్రయాణీకుల వాహనాలకు ప్రపంచంలో మూడవ అతిపెద్ద మార్కెట్ అని.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వాహనాలను తయారు చేస్తున్న మొదటి మూడు దేశాలలో ఒకటి అని చెప్పారు.
ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పిఎల్‌ఐ) పథకం వంటి కార్యక్రమాల ద్వారా వివిధ రంగాలకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వ నిబద్ధతను మోదీ పునరుద్ఘాటించారు. “పరిశ్రమ కోసం, ప్రభుత్వం రూ. 25,000 కోట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి లింక్డ్ ప్రోత్సాహక పథకాన్ని ప్రవేశపెట్టింది,” అని మోదీ వివరించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
