Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!

|

Mar 10, 2022 | 10:22 PM

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన పలు సేవలను పునరుద్ధరించింది. రైళ్లలో లెనిన్, దుప్పట్లు, కర్టెన్లు సరఫరాపై..

Indian Railways: రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఇకపై ఏసీ కోచ్‌లలో ఆ ప్రయోజనం.. వివరాలివే!
Indian Railway
Follow us on

Indian Railways: ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా నిలిపివేసిన పలు సేవలను పునరుద్ధరించింది. రైళ్లలో లెనిన్, దుప్పట్లు, కర్టెన్లు సరఫరాపై ఉన్న నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకుంది. ఈ మేరకు భారత రైల్వే శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. కోవిడ్ 19 కారణంగా విధించిన కోవిడ్ నియమాల దృష్ట్యా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రోటోకాల్‌ (ఎస్‌ఓపి) ప్రకారం ప్రయాణికులకు రైళ్లలో లెనిన్‌, దుప్పట్లు, కర్టెన్ల సరఫరాపై గతంలో నిబంధనలను విధించింది. ప్రస్తుతం కరోనా ప్రభావం లేకపోవడంతో రైల్వే శాఖ వీటి సరఫరాపై పునరాలోచనలో పడింది. ఈ క్రమంలోనే.. రైళ్లలో లెనిన్, దుప్పట్లు, కర్టెన్ల సరఫరాపై విధించిన నిబంధనలను తక్షణమే ఉపసంహరించాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. కోవిడ్‌కు ముందున్న విధంగానే వాటిని తక్షణమే ప్రయాణికులకు అందజేయాలని భారతీయ రైల్వే నిర్ణయించింది.

Also read:

Viral Video: మూడ్ ఆఫ్‌లో ఉన్నారా? అయితే ఈ వీడియో చూసి ఫుల్లుగా నవ్వుకోండి.. బుడ్డోడి యాక్టింగ్ మామూలుగా లేదు..!

High Cholesterol Effects: మీ శరీరంలో అధిక కొవ్వు ఉందా?.. రాత్రి సమయంలో ఈ సమస్యలు రావొచ్చు..!

Viral Video: వావ్ ఇది కదా తల్లి ప్రేమంటే.. మహిళకు అపూర్వంగా కృతజ్ఞతలు తెలిపిన కుక్క.. లవ్లీ వీడియో చూసేయండి..!