PF Limits: ఉద్యోగులకు తీపి కబురు… తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పీఎఫ్‌ జమ విషయంలో ఎంతో ఊరట..!

|

Mar 24, 2021 | 1:50 PM

PF Limits: ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ ఎంతో ముఖ్యం. ఈ పీఎఫ్‌ అనేది జీవితంలో ఎంతో ఉపయోగపడే నిధి. ఖాతాలో జమ అయిన రూ.2.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు..

PF Limits: ఉద్యోగులకు తీపి కబురు... తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పీఎఫ్‌ జమ విషయంలో ఎంతో ఊరట..!
Pf Limits
Follow us on

PF Limits: ప్రతి ఉద్యోగికి పీఎఫ్‌ ఎంతో ముఖ్యం. ఈ పీఎఫ్‌ అనేది జీవితంలో ఎంతో ఉపయోగపడే నిధి. ఖాతాలో జమ అయిన రూ.2.5 లక్షల మొత్తంపై పన్ను మినహాయింపు లభిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఉద్యోగులకు ఉద్యోగులకు మేలు చేసేలా నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు రూ.2.5 లక్షల పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఉద్యోగులకు పీఎఫ్‌ విషయంలో భారీ ఊరట లభించినట్లయింది. పీఎఫ్‌ ఖాతాలో ఉద్యోగులు, యాజమాన్యాల వాటా కలిపి ఆర్థిక సంవత్సరంలో మొత్తం 2.50 లక్షలకు మంచి జమ అయినట్లయితే దానిపై లభించే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టిన 2021-22 బడ్జెట్‌లో ఆ పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచగా, తాజాగా మంగళవారం దీనిపై ప్రకటన చేసింది.  దీంతో ఉద్యోగులకు భారీగా ఊరట లభించినట్లయింది.

సాధారణంగా ఈపీఎఫ్‌ చట్టం ప్రకారం నిర్బంధ చందా కింద మూలవేతనం, డీఏ మొత్తంలో కలిపి 12 శాతం ఉద్యోగి తన వాటాగా ఈపీఎఫ్‌లో జమ చేయాల్సి ఉంటుంది. అంతే మొత్తంలో యాజమాన్యం తన వాటా కింద ఈపీఎఫ్‌లో జమ చేస్తుంది. కానీ యాజమాన్యం తన వాటా కింద ఈపీఎఫ్​లో జమచేస్తుంది. అయితే యాజమాన్యాలు ఒకవేళ ఇంతకు మించి మొత్తాన్ని జమ చేసిన సందర్భంలో తాజాగా ప్రకటించిన రూ.5 లక్షల వరకు పన్ను మినహాయింపునకు పరిగణనలోకి తీసుకోబోమని మంత్రి సభలో స్పష్టం చేశారు. అంటే చందాదారుడి పీఎఫ్ ఖాతాకు యాజమాన్యాలు తమ వాటా కంటే అదనంగా జమ చేయని పక్షంలో మాత్రమే ఏటా రూ.5 లక్షల మొత్తం వరకు పీఎఫ్​ జమపై పన్ను మినహాయింపు లభిస్తుందని చెప్పవచ్చు. రూ.2.50 లక్షల కంటే తక్కువ పీఎఫ్​ను ఏటా జమ చేసే వారు 92 నుండి 93 శాతం వరకు ఉంటారని, వారికి పన్ను రహిత వడ్డీ లభిస్తుందని ఆమె స్పష్టం చేశారు.

ఇవీ కూడా చదవండి : Price Hike: ఏప్రిల్‌ 1 నుంచి బాదుడే.. బాదుడు.. వీటి ధరలు భారీగా పెరగనున్నాయి…కొనాలంటే ఇప్పుడే కొనేయండి..!

Premiums Increase: ప్రస్తుతం ఉన్న ఆరోగ్య బీమా పాలసీలపై ఎలాంటి మార్పులు చేయరాదు.. సంస్థలకు ఐఆర్డీఏఐ ఆదేశం

FD Insurance: మీరు బ్యాంకులో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? దానిపై అధిక ఇన్సూరెన్స్‌ పొందాలంటే ఏం చేయాలి..?