AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

50ఏళ్ల ఉపాధ్యాయుడి నిర్వాకం.. నగదు, నగలు సహా మైనర్‌ బాలికతో పరార్..! నెట్‌లో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ..

గత జూలై నెలలో మైనర్ విద్యార్థిని ఉపాధ్యాయుడు కిడ్నాప్‌ చేశాడు. విద్యార్థిని తన వద్ద ఉన్న నగదు, నగలు, ఆధార్ కార్డు తదితరాలను కూడా తీసుకెళ్లింది. టీచర్ తనను ప్రలోభపెట్టాడని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. యువతితో అసభ్యకర వీడియో, ఫొటోలను చిత్రీకరించి గ్రామస్థులకు పంపి వైరల్‌ చేశాడు. దీంతో పరువు పోతుందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నిందితుడు గతంలో కూడా తమ కూతురిని వెంబడించేవాడని చెప్పారు.

50ఏళ్ల ఉపాధ్యాయుడి నిర్వాకం.. నగదు, నగలు సహా మైనర్‌ బాలికతో పరార్..! నెట్‌లో ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తూ..
Minor Student
Jyothi Gadda
|

Updated on: Oct 10, 2023 | 12:28 PM

Share

50 ఏళ్ల ఉపాధ్యాయుడు తన తరగతిలోని విద్యార్థితో కలిసి పారిపోయాడు. 30 వేల రూపాయల నగదు, నగలు కూడా ఎత్తుకెళ్లాడు. పోలీసులు అతని కోసం రెండు నెలలుగా విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ షాకింగ్‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని గోండా జిల్లాలో చోటు చేసుకుంది. మైనర్ విద్యార్థినితో కలిసి పారిపోయిన 50 ఏళ్ల ఉపాధ్యాయుడిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక వయసు కేవలం 17 ఏళ్లు మాత్రమే కావడంతో ఈ ఘటనకు సంబంధించి సోమవారం కిడ్నాప్ కేసు నమోదైంది. సదరు ఉపాధ్యాయుడు తమ కుమార్తెకు సంబంధించిన అభ్యంతరకర ఫోటోలను వైరల్ చేస్తున్నారని, దాని వల్ల సమాజంలో తమ పరువు పోతుందని విద్యార్థి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

యూపీలోని రూరల్ గోండాలోని కొత్వాలి ప్రాంతంలో ఉన్న ఒక గ్రామంలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. గత జూలై నెలలో మైనర్ విద్యార్థిని ఉపాధ్యాయుడు అపహరించాడు. విద్యార్థిని తన వద్ద ఉన్న నగదు, నగలు, ఆధార్ కార్డు తదితరాలను కూడా తీసుకెళ్లింది. టీచర్ తనను ప్రలోభపెట్టాడని బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. యువతితో అసభ్యకర వీడియో, ఫొటోలను చిత్రీకరించి గ్రామస్థులకు పంపి వైరల్‌ చేశాడు. దీంతో పరువు పోతుందని, తమకు న్యాయం చేయాలంటూ తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 3 నెలలు గడుస్తున్నా పోలీసులు ఇంకా తమ కూతురి జాడ కనిపెట్టలేకపోయారని బాలిక తండ్రి వాపోయాడు. తమకు న్యాయం కావాలని డిమాండ్‌ చేస్తున్నాడు. కాగా, ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసినట్లు అదనపు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. అయితే, నిందితుడైన టీచర్ బాలికకు దూరపు బంధువు అని పోలీసులు చెప్పారు. ఇకపోతే, నిందితుడి ఇంట్లో చేసిన పాత అసభ్యకర వీడియో వైరల్‌గా మారింది. ఇందులో బాలిక, నిందితుడు కనిపిస్తున్నారు. వీడియోపై విచారణ జరుగుతోందన్నారు.

50 ఏళ్ల నిందితుడు టీచర్ గ్రామంలో ట్యూషన్ చెప్పేవాడు. అతను బహ్రైచ్ జిల్లా నివాసిగా గుర్తించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి 2 నెలలు దాటినా పోలీసులు మాత్రం ఎలాంటి ఆనవాళ్లు కనిపెట్టలేకపోయారంటూ బాధితురాలి తండ్రి ఆరోపించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..