ఈ ఏడాది బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.. ఒక విధంగా మేలే జరిగిందంటున్న నిపుణులు

భారతదేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఫంక్షన్‌ బంగారంతోనే ముడిపడి ఉంటుంది. భారతీయులు

ఈ ఏడాది బంగారం దిగుమతులు పూర్తిగా తగ్గిపోయాయి.. ఒక విధంగా మేలే జరిగిందంటున్న నిపుణులు
Follow us

|

Updated on: Dec 21, 2020 | 6:00 AM

భారతదేశంలో బంగారానికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి ఫంక్షన్‌ బంగారంతోనే ముడిపడి ఉంటుంది. భారతీయులు సంవత్సరం పొడవునా బంగారం కొనుగోలు చేస్తారు. పేదవాడి నుంచి ధనవంతుడి వరకు ఎప్పుడో ఒకప్పుడు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడం పరిపాటిగా మారింది. ఇక దేశంలో బంగారానికి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే ఎంత ధర పెరిగినా జనాలు బంగారం కొంటుంటారు. అందుకే ప్రభుత్వం కూడా టాక్స్ బాగానే వసూలు చేస్తాయి. దీంతో కొంతమంది అక్రమార్కులు స్మగ్లింగ్ చేస్తుంటారు.

ఇదిలా ఉంటే ఈ ఏడాది కరోనా పుణ్యమా అని బంగారం దిగుమతులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య కాలంలో 40 శాతం మేర దిగుమతులు తగ్గినట్లు దేశ వాణిజ్య శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయానికి బంగారం దిగుమతుల విలువ 20.6 బిలియన్ డాలర్లు కాగా ఈ ఏడాది అది 12.3 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇక వెండి విషయానికి వస్తే దిగుమతులు భారీగా పడిపోయాయి. దిగుమతులు తగ్గడం వల్ల ఓ విధంగా దేశానికి మేలే జరిగిందని నిపుణులు భావిస్తున్నారు.