అయ్యో.. ఎంత పని చేశావ్ తల్లి! పక్కంటి కుర్రాడు సైకిల్ ఇవ్వలేదని 11 ఏళ్ల బాలిక ఏం చేసిందంటే..?
కర్ణాటకలోని హిరియూర్‌లో 11 ఏళ్ల బాలిక స్పందన, తన పక్కింటి అబ్బాయి సైకిల్ ఇవ్వకపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. సైకిల్‌ను ఇవ్వకపోవడంపై మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని చనిపోయింది. ఈ ఘటన తల్లిదండ్రులను కన్నీరుమున్నీరుగా విలపించేలా చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇరుగుపొరుగు ఇళ్లలో ఉంటే పిల్లలు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అలానే ఓ బాలిక వాళ్ల పక్కింట్లో ఉండే పిల్లాడితో కలిసి సరదాగా సైకిల్ తొక్కుతూ ఆడుకునేది. అయితే ఆ అబ్బాయి ఎందుకనో.. ఒక రోజు సైకిల్ ఇవ్వలేదు. దాంతో ఆ బాలిక ఊహించని నిర్ణయం తీసుకుంది. ఇంట్లోకి వెళ్లి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సైకిల్ ఇవ్వలేదని మనస్తాపం చెందిన బాలిక ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలోని హిరియూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
గోపాల్, రుద్రమ్మ దంపతుల కుమార్తె స్పందన (11) ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. స్పందన తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై హిరియూర్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కాగా అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ఇలా తమను శోకసంద్రంలో ముంచి వెళ్లడంతో పాపం ఆ బాలిక తల్లిదండ్రులు కన్నీరుమూన్నీరుగా విలపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
