‘లొంగిపోతా..రూ. 20 లక్షలివ్వండి’..ఎన్‌కౌంటర్ ముందు వికాస్ దూబే

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే తన ఎన్ కౌంటర్ కి  ముందు సుబోధ్ తివారీ అనే బీజేపీ నేతతో చేసిన వాట్సాప్ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. జులై 3 న కాన్పూర్ సమీప గ్రామంలో 8 మంది పోలీసులను..

'లొంగిపోతా..రూ. 20 లక్షలివ్వండి'..ఎన్‌కౌంటర్  ముందు వికాస్ దూబే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jul 26, 2020 | 5:43 PM

గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే తన ఎన్ కౌంటర్ కి  ముందు సుబోధ్ తివారీ అనే బీజేపీ నేతతో చేసిన వాట్సాప్ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ వెలుగులోకి వచ్చింది. జులై 3 న కాన్పూర్ సమీప గ్రామంలో 8 మంది పోలీసులను తను, తన సహచరులు హతమార్చిన అనంతరం అతడిలో భయం పట్టుకుంది. నేను  పోలీసులకు గానీ, కోర్టులో గానీ సరెండర్ అవుతానని, ఈ లోగా తనకు రూ. 20 లక్షలు, రెండు జతల బ్లాక్ కోట్లు, షూ లు ఏర్పాటు చేయాలని వాట్సాప్ ద్వారా తివారీని కోరాడట.. ఇలా చేస్తే కాన్పూర్ లో ప్లాటు, 20 లక్షలకు రెట్టింపు సొమ్ము ఇస్తానని, ఇంకా ఏ సహాయం కావాలన్నా అందుకు రెడీ అని చెప్పాడట..(ఇతడ్ని జులై 10 న పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.)   ఇప్పుడీ వాట్సాప్ సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన కోట్లు, బూట్ల సైజు కూడా దూబే వివరించాడట.

అయితే ఈ వాట్సాప్ చాటింగ్, కాల్ వివరాలను తాను  యూపీ పోలీసులకు తెలియజేశానని, అవతలి వైపు ఉన్న వ్యక్తి వికాస్ దూబేనా కాదా అన్నది నిర్ధారణగా చెప్పలేనని సుబోధ్ తివారీ అంటున్నారు. ఈ వాట్సాప్ సంభాషణ ఎలా లీక్ అయిందో తెలియడంలేదని చెప్పిన ఆయన…. ఇప్పుడు తనకు ప్రాణ భయం పట్టుకుందని వాపోయారు. యూపీ పోలీసులకు అన్ని విధాలా సహకరిస్తానని ఆయన చెప్పారు.