Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

G20 Dinner Menu: ప్రపంచ దేశాధినేతలకు భారతీయ రుచులు.. డిన్నర్ మెనూలో ఇవి చాలా స్పెషల్..

G20 summit: భారత్‌ అధ్యక్షతన తొలిసారిగా జరుగుతున్న ప్రతిష్టాత్మక జీ20 సదస్సు ఢిల్లీలో కొనసాగుతోంది.. భారత మండపానికి వచ్చిన దేశాధినేతలకు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. ఉదయం 10:30కు ప్రగతి మైదాన్‌లోని భారత్‌ మండపంలో జీ20 సదస్సు ప్రారంభం అయ్యింది. డిన్నర్ విందు కోసం తయారు చేయబడిన మెనూలో భారతదేశంలో వర్షాకాలంలో తినే వంటకాలు ఉన్నాయి. సన్నాహాలు జరుగుతున్నాయి. ఒక లగ్జరీ హోటల్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు , సిబ్బంది రెండు రోజుల సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపంలో విందు ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు.

G20 Dinner Menu: ప్రపంచ దేశాధినేతలకు భారతీయ రుచులు.. డిన్నర్ మెనూలో ఇవి చాలా స్పెషల్..
G20 Dinner Menu
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 09, 2023 | 2:48 PM

జీ 20 శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని ఢిల్లీ సర్వాంగ సుందరంగా స్వాగతం పలికింది. భారత్‌ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సు ప్రగతి మైదాన్‌లోని భారత మండపంలో అట్టహాసంగా జరుగుతోంది. జీ20 దేశాధినేతలు, ఇతర ప్రతినిధుల కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పెషల్ వంటకాల లిస్టును రెడీ చేశారు. ఈ విందును భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లోని రుచులను ప్రత్యేకంగా రుచి చూపించనున్నారు. ఇందుకు అనుగూనంగా మెనూను సిద్ధం చేశారు. భారతీయులు వర్షాకాలంలో తినే వంటకాలకే ప్రత్యేక స్థానం కల్పించారు. ఒక లగ్జరీ హోటల్ గ్రూప్ సీనియర్ మేనేజర్లు, సిబ్బంది రెండు రోజుల సమ్మిట్ జరుగుతున్న భారత్ మండపంలో డిన్నర్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశాల్లో జైపూర్ వెండి నగిషీ పాత్రలను ఇక్కడ ఉపయోగిస్తున్నారు. ఈ పాత్రలను తయారు చేసిన ప్రత్యేక సామాగ్రిలో అధికారిక విందును అందిస్తున్నారు.

హాస్పిటాలిటీ గ్రూప్‌లోని ఓ ప్రతినిధి ఆ వివరాలను అందించారు.. భారతదేశంలో వర్షాకాలంలో తినే వంటకాలను మాత్రమే ఇక్కడ అందించనున్నారు. సీజనల్  స్పెషల్  మెనూని సిద్ధం చేశారు. మెనూలో స్వీట్స్‌తోపాటు మిల్లెట్ ఆధారిత వంటకాలు కూడా ఉండనున్నాయి.

అతిథులు గుర్తుంచుకునేలా..

మెనూ వివరాలను బయటకు అందించనప్పటకీ.. ఈ మెనూ పూర్తిస్థాయిలో భారతీయ వంటకాలు ఉంటాయని మాత్రం తెలుస్తోంది.జీ20 శిఖరాగ్ర సదస్సు తొలి రోజు ముగిసిన తర్వాత డిన్నర్‌ను చాలా స్పెషల్‌ అని ప్రచారంలో ఉంది.

మెనూ వివరాలు పబ్లిక్‌గా చెప్పనప్పటకీ.. భారీయత వటకాలను అతిధులకు రుచి చూపించనున్నారు. దేశధినేతలకు అతిధులకు చిరకాలం గుర్తుండిపోయేలా ప్లాన్ చేశారు. ఇందులో ముఖ్యంగా గులాబ్ జామూన్, రస్మలై, జిలేబీతోపాటు భారతీయులు ఎకువగా ఇష్టంగా తినే కొన్ని ప్రత్యేక స్వీట్స్‌ను రెడీ చేశారు. వంటకాలు అందించే సిబ్బంది భారతీయత ఉట్టిపడేలా దుస్తులను ధరించనున్నారు. మెనూలో భారత ప్రభుత్వం నుండి ఇంకా అధికారిక ప్రకటన విడుదల కాలేదు.

వెండి పాత్రలలో వడ్డిస్తారు

ప్రతినిధులు ప్రత్యేక వెండి సామాగ్రిని ఉపయోగిస్తారా..? ఈ ప్రశ్నకు ప్రతిస్పందనగా, హాస్పిటాలిటీ గ్రూప్ అవును అని సమాధానం ఇచ్చింది. జైపూర్‌కు చెందిన ఒక మెటల్ పాత్రల తయారీ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. ప్రత్యేక విందులలో కూడా వీటిని ఉపయోగించనున్నారు.

ఆ వెండి పాత్రలను మీడియా ముందు ప్రదర్శించింది. వీటి తయారీలో200 వంది కళాకారులు పని చేశారు. జీ20 లీడర్స్ సమ్మిట్ శని,ఆదివారాల్లో ప్రగతి మైదాన్‌లో కొత్తగా నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్, ఎగ్జిబిషన్ సెంటర్ – ఇండియా మండపంలో జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం

మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
మనోజ్‌ను చూడగానే..స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న మంచు లక్ష్మీ.
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
ఐపీఎల్‌కి ముందు అట్టర్ ఫ్లాప్.. పవర్ ప్లేలో గుంటూర్ మిర్చినే
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
గొప్ప మనసు చాటుకున్న అందాల భామ..
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
బిగ్ అలర్ట్.. రెండు రోజులు వర్షాలే వర్షాలు.. కానీ, ఈ ప్రాంతాల్లో
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామనీ.. నలుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
శ్రీవారిని దర్శించుకుని కుమారుడి కోసం మొక్కులు తీర్చుకున్న అన్నా
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
ఢిల్లీ అగ్రస్థానానికి 3 బంతుల్లో చెక్ పెట్టేసిన ముంబై
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
తుదిదశలో రామాలయనిర్మాణం త్వరలో రామదర్బార్ సహా 18 విగ్రహాలప్రతిష్ట
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
కుర్చీ మాదే! అధికారంపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మాటల యుద్ధం..
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video
వరంగల్‌ జాబ్‌మేళాలో అపశృతి.. ప్రవేశ ద్వారం వద్ద తొక్కిసలాట! Video