మంగళవారం ఢిల్లీకి వెళ్లే ఎయిర్ ఇండియా విమానంలో సమస్య తలెత్తడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ)లో పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలిసింది. మంగళవారం సాయంత్రం 5.44 గంటల సమయంలో పుణె నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా AI858 విమానం విండ్ షీల్డ్ పై చిన్న పగులు ఏర్పడడంతో, ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫుల్ ఎమెర్జెన్సీ ప్రకటించి, షెడ్యూల్డ్ టైమ్ కన్నా ముందే ల్యాండ్ చేశారు. ఆ విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
విండ్ షీల్డ్ కు కుడివైపు చిన్న పగులు గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ కు అనుమతి కోరారు. దాంతో, వెంటనే ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించి, మిగతా విమానాల ల్యాండింగ్, టేకాఫ్ సమయాలలో మార్పులు చేసి, ఈ ఎయిర్ ఇండియా విమానం ల్యాండ్ చేయడానికి అధికారులు అనుమతి ఇచ్చారు. ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..