Mahashivratri: హర హర మహాదేవ.. ఈషా క్షేత్రంలో అంబరాన్నంటేలా శివరాత్రి సంబురాలు..
మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే.. ఎవ్వరికైనా ఈషా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమం గుర్తుకువస్తుంది. అంతలా మహాశివరాత్రిని సెలబ్రేట్ చేస్తుంది ఈషా ఫౌండేషన్.

మహాశివరాత్రి పర్వదినం వచ్చిందంటే.. ఎవ్వరికైనా ఈషా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమం గుర్తుకువస్తుంది. అంతలా మహాశివరాత్రిని సెలబ్రేట్ చేస్తుంది ఈషా ఫౌండేషన్. సద్గురు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో కనీవినీ ఎరుగనిరీతిలో జరుగుతాయి వేడుకలు. ప్రతి ఏడాదిలాగే ఈసారీ మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది సద్గురు నేతృత్వంలోని ఈషా ఫౌండేషన్.. మహాశివరాత్రిని పురస్కరించుకుని తమిళనాడు కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతోంది. దేశ విదేశీ ప్రముఖులతోపాటు వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా పాల్గొని భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఈషా ఫౌండేషన్ నిర్వహిస్తోన్న మహాశివరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈషా ఫౌండేషన్ ప్రాంగణంలో కలర్‌ఫుల్‌గా సాగుతున్నాయి మహాశివరాత్రి వేడుకలు. ప్రముఖులతోపాటు, సాధారణ ప్రజలు దీపాలను వెలిగించి శివుడి నామస్మరణతో పూజలు నిర్వహిస్తున్నారు. కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరిస్తుంటే.. గాయనీ గాయకులు తమ పాటలతో మరో లోకంలోకి తీసుకెళ్తున్నారు. ఈ సాయంత్రం 6గంటలకు ప్రారంభమైన బిగ్ ఈవెంట్… రేపు మార్నింగ్ సిక్స్ వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది హాజరై భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు.




On this auspicious night of Mahashivratri, hope you are staying connected with us! Keep celebrating, keep tweeting, #ShivaShivaAllNight pic.twitter.com/znUBzaHT0b
— Isha Foundation (@ishafoundation) February 18, 2023
ఈషా ఫౌండేషన్ కార్యక్రమంలో భక్తులు భౌతికంగానే కాకుండా ఆన్‌లైన్‌లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావచ్చు. బెంగళూరులోని సద్గురు సన్నిధిలో జరిగే ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా వీక్షించవచ్చు.
శివరాత్రి సంబరాలు వీడియో..
అంతకుముందు TV9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ నిర్వహించిన ఇంటర్వ్యూలో సద్గురు ప్రత్యేకంగా మాట్లాడారు. డ్యుయోలాగ్ విత్ బరున్ దాస్ తాజా ఎడిషన్‌లో సద్గురు మహాశివరాత్రి వేడుకల నుంచి ఆధ్యాత్మిక చింతన, పలు విషయాల గురించి అడిగారు. ఈ కార్యక్రమం మొత్తం ఆరు ఎడిషన్లలో ప్రసారం కానుంది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను వీక్షించండి..
డ్యుయోలాగ్ విత్ బరున్ దాస్ ప్రోమో..
మరిన్ని జాతీయ వార్తల కోసం..