ఒలంపిక్స్ లో భారత పతక విజేతలకు, పురుషుల హాకీ టీమ్ కి ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు రెండు ఎయిర్ లైన్స్ సంస్థలు ప్రకటించాయి. ఇది వరకు ‘గో ఎయిర్’ గా వ్యవహరించిన ‘గో ఫస్ట్’,ఎయిర్ లైన్స్ తాము 5 ఏళ్ళ పాటు వీరికి ఫ్రీ టికెట్స్ ఇస్తామని ప్రకటించగా.. ఇండియాలో 13 నగరాలను కలిపే స్టార్ ఎయిర్.. వీరికి జీవిత పర్యంతం ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వెల్లడించింది. గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోవర్ నీరజ్ చోప్రాకు ఏడాది పాటు అపరిమిత ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీని కల్పిస్తున్నట్టు ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రకటించింది. ఒలంపిక్స్ లో మీరాబాయి చాను, పీ.వి.సింధు, లవ్ లీనా, పురుషుల హాకీ టీమ్, రవి కుమార్ దహియా, బజరంగ్ పునియా, నీరజ్ చోప్రా తమ తమ ప్రతిభను చూపి పతకాలు సాధించారు. ఈ విజేతలకు ఇలా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నామని గో ఎయిర్, స్టార్ ఎయిర్ పేర్కొన్నాయి.
ఇలా ఉండగా ఒలింపియన్ మీరాబాయి చాను ఆదివారం తన 27 వ బర్త్ డేని సెలబ్రేట్ చేసుకుంది. మణిపూర్ సీఎం ఎన్.బీరేన్ సింగ్ సమక్షంలో ఆమె బర్త్ డే కేక్ కట్ చేసింది. అటు-భారత పతక విజేతలకు పదేళ్ల పాటు ఫ్రీ హెల్త్ చెకప్, ఇతర ప్యాకేజీలు ఉన్నాయని, ఇతర అథ్లెట్లకు నాలుగేళ్ల పాటు ఈ సౌకర్యం ఉంటుందని క్రికెటర్ యువరాజ్ సింగ్ ఇదివరకే ప్రకటించాడు. పతకాలు వచ్చినా.. రాకున్నా ఒలింపిక్స్ లో వీరు చూపిన ప్రతిభ అసామాన్యమైనదని.. వీరి క్రీడా స్ఫూర్తి దేశ యువతకు ఆదర్శం కావాలని అన్నాడు.
మరిన్ని ఇక్కడ చూడండి: Trailer Talk: అసలు సూర్యకు ఏమైంది.. అతను కనబడకుండా పోవడానికి కారణమేంటి? ఆసక్తికరంగా సునీల్ సినిమా ట్రైలర్.
Shakuni Temple: మహాభారతంలో విలన్ గా చెప్పుకునే శకునికి కూడా ఆలయం ఉంది.. ఎక్కడో.. ఎందుకో తెలుసా?